Razesh Danda: సహనం కోల్పోయి మాట్లాడా.. కె ర్యాంప్ నిర్మాత ఆవేదన
ABN, Publish Date - Oct 22 , 2025 | 09:09 PM
కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram), యుక్తి తరేజా జంటగా జైన్స్ నాని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కె ర్యాంప్ (K Ramp). రాజేష్ దండా (Razesh Danda), శివ బొమ్మక్ నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 18 న రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది.
Razesh Danda: కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram), యుక్తి తరేజా జంటగా జైన్స్ నాని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కె ర్యాంప్ (K Ramp). రాజేష్ దండా (Razesh Danda), శివ బొమ్మక్ నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 18 న రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. అవుట్ అండ్ అవుట్ కామెడీతో కిరణ్ అబ్బవరం వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. శనివారం రిలీజ్ అయిన ఈ చిత్రం.. సోమవారం టెస్ట్ ను కూడా పాస్ అయ్యి ప్రేక్షకుల ఆదరణకు నోచుకుంది. ఇక కలక్షన్స్ పరంగా కూడా రికార్డులు సృష్టిస్తుంది.
కె ర్యాంప్ హిట్ అందుకోవడంతో మేకర్స్ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ సక్సెస్ మీట్ లో నిర్మాత రాజేష్.. తన సినిమాను అందరూ బావుంది అన్నారు కానీ, ఒక్క వెబ్ సైట్ మాత్రం నెగిటివ్ రివ్యూ ఇస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. 'నేను కోట్ల రూపాయలు పెట్టి సినిమా తీసాను. ఒక తెలుగు వెబ్‌సైట్ దానికి రివ్యూ ఇచ్చింది, రేటింగ్ ఇచ్చింది. ఆ వరకు నాకు అభ్యంతరం లేదు. కానీ సినిమా హిట్ అవుతుంటే, తమ రేటింగ్ క్రెడిబులిటీ పోతుందనే భయంతో, వాళ్లు నెగిటివ్ పోస్టులు పెడుతున్నారు' అంటూ కొద్దిగా పరుష పదజాలం ఉపయోగించి మాట్లాడాడు.
రాజేష్ దండా వ్యాఖ్యలు సోషల్ మీడియాను షేక్ చేసాయి. నిర్మాత ఆవేదన కరెక్ట్ అయ్యి ఉండొచ్చు కానీ, అలా బహిరంగంగా బూతులు తిట్టడం కరెక్ట్ కాదని చెప్పుకొచ్చారు. ఒక్కరు చేసిన తప్పుకు మీడియా మొత్తాన్ని అనడం సరికాదని చెప్పగా.. రాజేష్ ఒక పెద్ద ప్రకటనను రిలీజ్ చేశాడు. తాను కేవలం ఆ ఒక్క వెబ్ సైట్ ను మాత్రమే అన్నానని మీడియా మొత్తాన్ని కాదని క్లారిటీ ఇచ్చాడు.
ఇక అంతేకాకుండా సదురు వెబ్ సైట్ పై ఫిల్మ్ ఛాంబర్ లో ఫిర్యాదు చేశాడు. సినిమా హిట్ అయినా కూడా నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. వారిపై చర్యలు తీసుకొని.. తమ సినిమాకు ఇచ్చిన రివ్యూలను తొలగించమని ఫిర్యాదులో కోరాడు. అంతేకాకుండా స్టేజిపై బూతులు మాట్లాడినందుకు అందరిని క్షమించమని కోరాడు.
'ఫిర్యాదు అని ఏమి లేదండీ.. ఒక సక్సెస్ ఈవెంట్ లో నా సినిమా బాగా వెళ్తుంది అని ఆనందం అందరితో పంచుకుంటుంటే.. ఆ టైమ్ లో కూడా ఆ వెబ్ సైట్ ఏవేవో కలక్షన్స్ వేసి.. ఇది హిట్ కాదు అని ప్రాజెక్ట్ చేస్తుంటే ఏదో బాధపడి సహనం కోల్పోయి నేను మాట్లాడిన మాటలు. నాకు ఎవరిమీద కోపం లేదు. ఏం జరిగింది అనేది నేను ఛాంబర్ కి, గిల్ట్ కి, ప్రొడ్యూసర్ కౌన్సిల్ కి చెప్పాను. ఇక నుంచి ధర్మ పోరాటం చేస్తాను.
రివ్యూ అనేది వారి పర్సనల్. కానీ, సినిమా మంచిగా ఆడుతున్నా కూడా వారు రాసింది నిజం అని ప్రూవ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అది నా బాధ. నేను మీడియా మొత్తాన్ని అనలేదు. ఒక వెబ్ సైట్ నే అన్నాను. ఆ విషయం నేను రాతపూర్వకంగా కూడా చెప్పాను. మీడియా లేకపోతే నేను ఇక్కడ ఉండేవాడిని కాదు' అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
Renu Desai: పవన్ మాజీ భార్య సన్యాసం.. దండం పెట్టి చెప్తున్నా అంటూ వీడియో రిలీజ్
NTR: ఎన్టీఆర్ మార్ఫింగ్ వీడియోలు.. సజ్జనార్ ను ఆశ్రయించిన ఫ్యాన్స్