Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ డేట్ చెప్పేసిన నిర్మాత..
ABN, Publish Date - Nov 19 , 2025 | 08:16 PM
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan kalyan) ఈ ఏడాది ఓజీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాతో పాటు పవన్ నటించిన సినిమా ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh).
Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan kalyan) ఈ ఏడాది ఓజీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాతో పాటు పవన్ నటించిన సినిమా ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh). హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఈ సినిమాలో పవన్ సరసన రాశీ ఖన్నా, శ్రీలీల నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టకున్నాయి. గబ్బర్ సింగ్ తరువాత హరీష్- పవన్ కాంబోలో వస్తున్న చిత్రం కావడంతో అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.
తమిళ్ లో విజయ్- అట్లీ కాంబినేషన్ లో వచ్చిన తేరి సినిమాకు రీమేక్ గా ఉస్తాద్ భగత్ సింగ్ తెరకెక్కుతుందని సమాచారం. ఈ సినిమాను పవన్ ఎన్నికల ముందు ఒప్పుకున్నాడు. పదవి వచ్చాక షూటింగ్ మొదలుపెట్టాడు. ఇక షూటింగ్ ను ఫినిష్ చేసుకున్న ఈ సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. అయితే ఇప్పటివరకు సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్ ను మేకర్స్ ఇవ్వలేదు. కనీసం రిలీజ్ డేట్ ను కూడా మేకర్స్ ప్రకటించలేదు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా నుంచి అప్డేట్ వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
ఎట్టకేలకు నిర్మాత రవిశంకర్ .. ఉస్తాద్ భగత్ సింగ్ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం మైత్రీ నిర్మిస్తున్న సినిమాలో ఆంధ్రా కింగ్ తాలూకా ఒకటి. రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా మహేష్ బాబు. పి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఉపేంద్ర కీలక పాత్రలో నటిస్తున్నాడు. నిన్న ఈ సినిమా తెలుగు ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. నేడు కన్నడలో ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఆ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నిర్మాత రవిశంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ కానుందని తెలిపాడు. డేట్ చెప్పలేదు కానీ, త్వరలోనే ఈ అప్డేట్ నే అధికారికంగా ఇవ్వనున్నారని సమాచారం. వచ్చే ఏడాది సమ్మర్లో పవన్ మరోసారి అభిమానులను అలరించనున్నాడు. మరి ఈ సినిమాతో పవన్ - హరీష్.. గబ్బర్ సింగ్ లాంటి హిట్ ను అందుకుంటారా..లేదా అనేది చూడాలి.