Naga Vamsi: నన్ను మిస్ అవుతున్నారా.. దానికి చాలా టైమ్ ఉంది
ABN, Publish Date - Aug 20 , 2025 | 04:24 PM
టాలీవుడ్ టాప్ నిర్మాతల్లో సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi) ఒకరు. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో స్టార్ హీరోల సినిమాలను నిర్మిస్తూ టాప్ రేంజ్ కు చేరుకున్నాడు.
Naga Vamsi: టాలీవుడ్ టాప్ నిర్మాతల్లో సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi) ఒకరు. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో స్టార్ హీరోల సినిమాలను నిర్మిస్తూ టాప్ రేంజ్ కు చేరుకున్నాడు. అసలు నిర్మాత ప్రమోషన్స్ లో మెయిన్ ఫిల్లర్ గా ఉండాలి అనే ట్రెండ్ తీసుకొచ్చింది నాగ వంశీనే. హీరో ఉన్నా లేకున్నా.. నాగ వంశీ మాత్రం ప్రమోషన్స్ లో మస్ట్ గా ఉండాలి. ఇక తన సినిమాలపై ఈయనకు ఉండే కాన్ఫిడెంట్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అలా కొన్ని సినిమాలకు వర్క్ అవుట్ అయినా.. కొన్ని సినిమాలకు మాత్రంవర్క్ అవుట్ కాలేదు.
గతేడాది అంతా విజయ పరంపర కొనసాగించిన నాగవంశీ ఈమధ్యకాలంలో పరాజయాలను వెనకేసుకుంటున్నాడు. వార్ 2 సినిమాతో మరింత నష్టాన్ని చవిచూశాడు. వార్ 2 తెలుగు హక్కులను వంశీ భారీ ధరకు కొనుగోలు చేసి రిలీజ్ చేశాడు. ఎన్టీఆర్ ను బాలీవుడ్ కు పరిచయం చేయడం కాదు.. అయాన్ నే తెలుగుకు పరిచయం చేస్తున్నాం అని చెప్పుకొచ్చి హైప్ పెంచాడు. ఆ హైప్ మొత్తం రివర్స్ అయ్యింది. వార్ 2 మిక్స్డ్ టాక్ అందుకొని కలక్షన్స్ ను రాబట్టలేకపోయింది. దీంతో బాగా కృంగిపోయిన నాగవంశీ తన ఆస్తులను అమ్ముకుని, ఈ విమర్శలను తట్టుకోలేక ఒక ఏడాది పాటు సోషల్ మీడియాకి దూరంగా ఉంటున్నట్లు వార్తలు వచ్చాయి.
అయితే అందులో ఏది నిజం కాదని నాగ వంశీ క్లారిటీ ఇచ్చాడు. తానెక్కడికి వెళ్లలేదని.. తనను మిస్ అవుతున్న వారందరికీ గట్టి షాక్ ఇస్తూ పోస్ట్ పెట్టాడు. ' ఏంటి.. నన్నుచాలా మిస్ అవుతున్నట్లు ఉన్నారు. వంశీ అది.. వంశీ ఇది అని గ్రిప్పింగ్ తో ఫుల్ల్ హడావిడి నడుస్తుంది. పర్లేదు. ఎక్స్ లో మంచి రైటర్స్ ఉన్నారు. మిమ్మల్ని డిజప్పాయింట్ చేసినందుకు నన్ను క్షమించండి. కానీ, ఇంకా ఆ సమయం రాలేదు. మినిమమ్ 10 నుంచి 15 ఏళ్లు ఉంది. సినిమాలోనే.. సినిమా కోసం ఎల్లప్పుడూ. మాస్ జాతర అప్డేట్ తో త్వరలో మళ్లీ కలుద్దాం ' అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.