Kajal Aggarwal: బీచ్ ఒడ్డున బికినీలో అక్కాచెల్లెళ్ల ముద్దులాట..

ABN , Publish Date - Jun 30 , 2025 | 12:55 PM

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Aggarwal Sisters

Kajal Aggarwal: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లక్ష్మీ కళ్యాణం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన కాజల్.. మొదటి సినిమాతోనే తన అందంతో తెలుగువారి గుండెలను కొల్లగొట్టింది. ఇక ఆ సినిమా తరువాత కాజల్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. కుర్ర హీరోలు, సీనియర్ హీరోలు అని తేడా లేకుండా కాజల్.. అందరితో రొమాన్స్ చేసి స్టార్ హీరోయిన్ గా మారింది. సమంత, తమన్నా, అనుష్క లాంటి స్టార్ హీరోయిన్లకు గట్టి పోటీ ఇచ్చి వారితో పాటే టాప్ హీరోయిన్ గా మారింది.


ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే కాజల్ పెళ్లి పీటలు ఎక్కింది. తన చిన్ననాటి స్నేహితుడు అయినా గౌతమ్ కిచ్లును వివాహమాడింది. సాధారణంగా వివాహం అయిన తరువాత హీరోయిన్స్ సినిమాలకు గ్యాప్ ఇస్తారని అందరికీ తెల్సిందే. కానీ, కాజల్ మాత్రం పెళ్లి తరువాత కూడా వరుస సినిమాలు చేసి ఆశ్చర్యపరిచింది. ఇక అంతేకాకుండా పెళ్లి అయిన ఏడాదిలోపే ఒక బిడ్డకు జన్మనిచ్చి తల్లిగా కూడా మారింది. అదేంటి.. కాజల్ ఇలా చేసింది. తల్లిగా మారితే అవకాశాలు ఏం వస్తాయి. ఇక అక్క, వదిన పాత్రలకు మాత్రమే ఈ చిన్నది పరిమితమని చెప్పుకొచ్చారు.


కాజల్ మాత్రం .. తన అందంతో పెళ్లి తరువాత కూడా హీరోయిన్ ఛాన్స్ లు పట్టేసింది. బాలయ్య సరసన భగవంత్ కేసరిలో నటించింది. ఇప్ప్పుడు కన్నప్ప సినిమాలో పార్వతి దేవిగా కనిపించి ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం కాజల్ చేతిలో రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. కాజల్ కొద్దిగా సమయం దొరికినా కుటుంబంతో కలిసి సమయం గడిపేస్తుంటుంది. ఏ వెకేషన్ కు వెళ్లినా ఆమె పక్కన చెల్లి నిషా కూడా ఉండాల్సిందే. నిషా అగర్వాల్.. అక్క గుర్తింపుతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. సోలో సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఈ చిన్నది.. ఆ తరువాత కొన్ని సినిమాలు చేసినా ఆశించిన ఫలితం దక్కపోయేసరికి పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యిపోయింది.


ఇక ఈ అక్కాచెల్లెళ్లు ఒక్క చోట కలిశారు అంటే రచ్చ రచ్చనే. ఎప్పుడు ఏదో ఒక వెకేషన్ లోనే కాదు.. ఇంటివద్ద కూడా వీరు కలిసి చేసిన వీడియోస్ నెట్టింట వైరల్ గా మారిన విషయం తెల్సిందే. తాజాగా ఈ ముద్దుగుమ్మలిద్దరూ తమ ఫ్యామిలీస్ తో కలిసి వెకేషన్ కు వెళ్లారు. ఆ వెకేషన్ లో అందరికన్నా ఈ అక్కాచెల్లెళ్ళిద్దరూ ఎక్కువ ఎంజాయ్ చేసినట్లు కనిపిస్తుంది. బీచ్ ఒడ్డున బికినీలో అగార్వల్ సిస్టర్స్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. బ్లాక్ బికినీలో నిషా.. వైట్ బికినీలో కాజల్.. బీచ్ ఒడ్డున కూర్చొని ఒకరికి ఒకరు ముద్దులిస్తూ తమ ప్రేమను చూపించారు.


ఇక కాజల్ - నిషా బీచ్ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇప్పటికీ వన్నె తగ్గకుండా ఇద్దరు అందగత్తెలు.. తమ గ్లామర్ తో కుర్రాళ్లకు నిద్రపట్టనివ్వకుండా చేస్తున్నారు. ఈ ఫోటోలు చూసిన అభిమానులు .. సూపర్.. సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Updated Date - Jun 30 , 2025 | 12:59 PM