Kingdom: కింగ్ డమ్ వాయిదా పడలేదు.. నిర్మాత నాగవంశీ క్లారిటీ

ABN, Publish Date - Jun 05 , 2025 | 04:16 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన హరిహర వీరమల్లు(HariHara Veeramallu) జూన్ 12 న రిలీజ్ కావడం లేదని గత రెండు రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

Kingdom: కింగ్ డమ్ వాయిదా పడలేదు.. నిర్మాత నాగవంశీ క్లారిటీ
Nagavamsi

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన హరిహర వీరమల్లు(HariHara Veeramallu) జూన్ 12 న రిలీజ్ కావడం లేదని గత రెండు రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఐదేళ్లుగా రిలీజ్ కు నోచుకోలేని ఈ సినిమా ఈసారి కూడా వాయిదా పడింది అనడంతో ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. ఇప్పుడు వాయిదా పడింది అంటే.. మళ్లీ రిలీజ్ ఎప్పుడు.. ? అనే డౌట్ అందరిలోనూ ఉంది.

ఇక జూన్ 12 న కనుక వీరుమల్లు రాకపోతే జూన్ 27, జూలై 4, జూలై 11 న రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి.జూన్ 27 న కన్నప్ప(Kannappa) రిలీజ్ కు రెడీ అవ్వడంతో పాటు ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టేశారు. దీంతో ఆ డేట్ ను మార్చలేము అని విష్ణు చెప్పేశాడు. ఇక జూలై 11 న ఘాటీ(Ghaati) రిలీజ్ కు సిద్దమవుతుంది.

చివరకు ఉన్న ఒకే ఒక్క డేట్ జూలై 4. ఆ డేట్ లో కింగ్ డమ్(Kingdom) రిలీజ్ కానుంది. ఈ డేట్ లోనే వీరమల్లు రిలీజ్ కానుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఆరోజు వచ్చే కింగ్ డమ్ వెనక్కి వెళ్లనుందని చెప్పుకొచ్చారు. విజయ్ దేవరకొండ నటించిన కింగ్ డమ్ ను సూర్యదేవర నాగవంశీ.. త్రివిక్రమ్ భార్య సౌజన్య కలిసి నిర్మించారు.

ఒకవేళ నాగవంశీ కనుక డేట్ ఇవ్వడానికి ఒప్పుకోకపోతే పవన్ కోసం త్రివిక్రమ్ రంగంలోకి దిగి ఒప్పిస్తాడు అనేది అందరికి తెల్సిందే. అయితే తాజాగా నాగవంశీ కింగ్ డమ్ వాయిదా పడలేదని క్లారిటీ ఇచ్చాడు. ఇప్పటివరకు కింగ్ డమ్ ను వాయిదా వేసే ఆలోచనలో లేమని, ఒకవేళ హరిహర వీరమల్లు కనుక ఆ డేట్ కు వస్తే అప్పుడు ఆలోచిస్తామని చెప్పుకొచ్చాడు. లేదంటే జూలై 4 న కింగ్ డమ్ రిలీజ్ పక్కా వస్తుందని, కింగ్ డమ్ వాయిదా అంటూ వస్తున్న వార్తలు ఫేక్ అని తేల్చి చెప్పేశాడు. రెండు మూడు రోజుల్లో కింగ్ డమ్ నుంచి కొత్త సాంగ్ ను కూడా రిలీజ్ చేస్తున్నామని తెలిపాడు. మరి వీరమల్లు ఏ డేట్ ను లాక్ చేసుకుంటాడో చూడాలి.

Updated Date - Jun 05 , 2025 | 04:18 PM