Naga Vamsi: సితార నుంచి కొత్త హీరో.. దర్శకుడు ఎవరంటే..
ABN, Publish Date - Sep 20 , 2025 | 10:53 AM
నిర్మాత నాగవంశీ కుటుంబం నుంచి కొత్త హీరో టాలీవుడ్‌కి పరిచయం కాబోతున్నారు.
నిర్మాత నాగవంశీ (Naga Vamsi) కుటుంబం నుంచి కొత్త హీరో టాలీవుడ్‌కి పరిచయం కాబోతున్నారు. ఆయన బావమరిది రిష్యా (Rishya) హీరోగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ద్వారా తెలుగు తెరకు పరిచయం కానున్నారు. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంతో ‘జాతిరత్నాలు’ చిత్రానికి దర్శకత్వ శాఖలో పని చేసిన శంకర్ (Shankar) ఈ సినిమాతో మెగా ఫోన్ పట్టబోతున్నారు. 'జైలర్, నా సామిరంగా' వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన మిర్నా మీనన్ (Mirnaa Menon) ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు. నూతన సంగీత దర్శకుడు ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
ఇప్పటికే మొదలై ఈ సినిమా 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకుందని తెలిసింది. త్వరలోనే నాగవంశీ తన బావమరిదిని ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారని, దీని కోసం ఓ ఈవెంట్ ప్లాన్ చేశారట. ప్రస్తుతం సితార బ్యానర్‌లో 'మాస్ జాతర, లెనిన్, అనగనగా ఒక రోజు' చిత్రాలు తెరకెక్కుతున్నాయి.