సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Naga Vamsi: అమ్మ బాబోయ్.. ఫస్టాఫ్ కే రూ. 12 లక్షల గిఫ్టా

ABN, Publish Date - Dec 20 , 2025 | 03:33 PM

మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి సినిమా తరువాత హీరో నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty) అనగనగా ఒక రాజు (Anaganaga Oka Raju) సినిమాలను మొదలుపెట్టాడు.

Naga Vamsi

Naga Vamsi: మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి సినిమా తరువాత హీరో నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty) అనగనగా ఒక రాజు (Anaganaga Oka Raju) సినిమాలను మొదలుపెట్టాడు. ఈ సినిమాను సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ(Suryadevara Naga Vamsi) నిర్మిస్తున్నాడు. మొదటి ఈ సినిమాలో శ్రీలీలని అనుకోక.. కొన్ని కారణాల వలన ఆమె తప్పుకొని మీనాక్షీ చౌదరి (Meenakshi Chaudhary) ఎంటర్ అయ్యింది. చాలాకాలం షూటింగ్ గ్యాప్ తీసుకొని ఎట్టకేలకు ఈ ఏడాది మొదట్లో కొత్త డైరెక్టర్ మారితో నాగవంశీ ఈ సినిమాను పట్టాలెక్కించాడు.

ఇక ఏదో ఒక విధంగా షూటింగ్ ని ఫినిష్ చేసి వచ్చే సంక్రాంతిబరిలో అనగనగా ఒక రాజు సినిమాను దించుతున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. నవీన్ ప్రమోషన్స్ ఏ రేంజ్ లో చేస్తాడో అందరికీ తెల్సిందే. అతని చొరవ వలనే ఈ సినిమాపై కొద్దో గొప్పో హైప్ పెరిగింది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ ను మేకర్స్ మొదలుపెట్టారు.

ఇదంతా పక్కన పెడితే.. నాగవంశీకి ఈ ఏడాది మొత్తం నష్టమే వాటిల్లింది. దెబ్బ మీద దెబ్బ అన్నట్లు వార్ 2, కింగ్డమ్ సినిమాలు నష్టాన్ని మిగిల్చాయి. అయినా అధైర్య పడకుండా నాగవంశీ అన్ని ఆశలను అనగనగా ఒక రాజు సినిమాపైనే పెట్టుకున్నాడు. తాజాగా సెన్సార్ కాపీ కోసం సినిమా చూసిన నాగవంశీ ఆనందంతో ఉబ్బితబ్బిబైపోయాడని టాక్. ఫస్టాఫ్ బాగా నచ్చి అప్పటికప్పుడే డైరెక్టర్ కి రూ. 12 లక్షల విలువ చేసే వాచ్ ని గిఫ్ట్ గా కూడా ఇచ్చాడట. నవీన్ కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందని.. కచ్చితంగా ఫ్యామిలీ ఆడియెన్స్ కి నచ్చుతుందని టాక్ నడుస్తోంది. సినిమా రిలీజ్ కాకముందే నాగవంశీ గిఫ్ట్ ఇచ్చాడంటే మంచి హిట్ అందుకున్నట్లే అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Updated Date - Dec 20 , 2025 | 03:35 PM