సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

KS Rama Rao: రూ.10 కోట్ల లోపు.. చిత్రాలకు అవార్డులు

ABN, Publish Date - Dec 21 , 2025 | 06:08 AM

ఫిల్మ్‌ నగర్‌ కల్చరల్‌ సెంటర్‌ (ఎఫ్‌ఎన్‌సీసీ) (FNCC) అధ్యక్షుడు కేఎస్‌ రామారావు (KS Rama Rao) ఫిల్మ్‌ మేకర్లకు ఓ తీపికబురు అందించారు.

KS Rama Rao

ఫిల్మ్‌ నగర్‌ కల్చరల్‌ సెంటర్‌ (ఎఫ్‌ఎన్‌సీసీ) (FNCC) అధ్యక్షుడు కేఎస్‌ రామారావు (KS Rama Rao) ఫిల్మ్‌ మేకర్లకు ఓ తీపికబురు అందించారు. చిన్న సినిమాలను ప్రోత్సహించడానికి అవార్డులు (FNCC Awards) ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘ఈ నెల 31న మా ఎఫ్‌ఎన్‌సీసీలో జరిగే సాంస్కృతిక ఉత్సవంలో రూ.10 కోట్లలోపు తెరకెక్కించిన చిత్రాలకు అవార్డులు అందజేయనున్నాం.

సమాజానికి ఉపయోగపడే విధంగా సందేశాత్మక, ప్రజలను మంచి ఆలోచనల వైపు నడిపించే చిత్రాలను పరిగణలోకి తీసుకుంటాం. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ హీరో, ఉత్తమ హీరోయిన్‌గా మొత్తం నాలుగు విభాగాల్లో పురస్కారాలు ఇవ్వనున్నాం. త్వరలోనే విజేతలను ప్రకటిస్తాం’ అని తెలిపారు.

Updated Date - Dec 21 , 2025 | 06:08 AM