Film Piracy: సర్వీస్ ప్రొవైడర్స్ ను తప్పు పట్టిన నిర్మాత...
ABN, Publish Date - Oct 04 , 2025 | 05:17 PM
సినిమాల పైరసీ వెనుక సర్వీస్ ప్రొవైడర్స్ నిర్లక్ష్యం కూడా ఉందని నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఆరోపించారు. కంటెంట్ ను థియేటర్లకు పంపుతున్న సందర్భంలో సర్వీస్ ప్రొవైడర్స్ సిస్టమ్స్ ను హ్యాక్ చేసి పైరసీ చేస్తున్నారని ఆయన అన్నారు.
వందల సినిమాలను 'ఐ బొమ్మ' (I Bomma) వెబ్ సైట్ హ్యాక్ చేయడం వెనుక సర్వీస్ ప్రొవైడర్స్ నిర్లక్షం కూడా ఉందని నిర్మాత, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి (Ketireddy Jagadeeswara Reddy) ఆరోపించారు. 'ఐ బొమ్మ' వెబ్ సైట్ నిర్వాహకులతో పాటు పైరసీకి పాల్పడుతున్న వ్యక్తుల్ని తెలంగాణ పోలీసులు బీహార్ లోనూ, మహారాష్ట్రలో, తమిళనాడులో పట్టుకున్నందుకు ఆయన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కేసులో ఎ - వన్ గా ఉన్న బీహార్ గోపాల్ గంజ్ కు చెందిన అశ్విన్ కుమార్ వాంగ్మూలం విస్తుపోయేలా చేసిందని జగదీశ్వర్ రెడ్డి అన్నారు. నిర్మాతలు ఇచ్చిన సినిమాలను వివిధ నగరాల్లోని థియేటర్లకు పంపుతోంది ఇప్పుడు డిజిటల్ గా సర్వీస్ ప్రొవైడర్సే నని, అలా సినిమా వారి కార్యాలయం నుండి థియేటర్లకు వెళ్ళే క్రమంలో ఆ యా సంస్థల సిస్టమ్స్ ను హ్యాక్ చేసి సినిమాలను పైరసీ చేస్తున్నారని ఆయన అన్నారు. యు.ఎఫ్.ఓ., క్యూబ్ వంటి సర్వీస్ ప్రొవైడర్స్ తమ వర్షన్స్ ను అప్ డేట్ చేయకుండా అలసత్వం ప్రదర్శించడం వల్లే ఈ స్థాయిలో పైరసీ జరిగిందని కేతిరెడ్డి జగదీశ్వరెడ్డి వాపోయారు. నేరస్థులు వచ్చిన వాగ్మూలం ప్రకారం, పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో తేలే దాని ప్రకారం సర్వీస్ ప్రొవైడర్స్ పై కూడా దృష్టి పెట్టాల్సి ఉందని, అలానే పైరసీ ద్వారా నష్టపోయిన నిర్మాతలకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని ఆయన కోరారు.
'ఐ బొమ్మ' నిర్వాహకులు రెండేళ్ళ క్రితం ఇచ్చిన స్టేట్ మెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోందని చెబుతూ, 'దొంగ పనిచేసి అక్రమ మార్గాలలో డబ్బు సంపాదించే వారికి చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడే హక్కులేదని కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి అన్నారు.
సినిమాల పైరసీలో సర్వీస్ ప్రొవైడర్స్ నిర్లక్ష్యం కూడా ఉందని నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వరెడ్డి ఆరోపించారు. వారి సిస్టమ్స్ ను హ్యాక్ చేసి సినిమాలను పైరసీ చేయడానికి కొందరు ప్రయత్నించారని ఆయన చెబుతున్నారు.
Also Read: Sasivadane: అశ్లీలతకు తావు లేకుండా నిజాయితీగా సినిమా చేశాం..
Also Read: Actress Hema: లైఫ్ అంతా పరుగెడుతూనే ఉన్నా.. ఎంజాయ్ లేదు...