సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Fighter Shiva: అశ్వినీదత్ చేతుల మీదుగా ‘ఫైటర్ శివ’ టీజర్‌‌

ABN, Publish Date - Aug 16 , 2025 | 11:21 PM

మణికాంత్, ఐరా బన్సాల్ జంటగా నటించిన చిత్రం ‘ఫైటర్ శివ’. ప్రభాస్ నిమ్మల దర్శకత్వం వహించారు. కౌండిన్య ప్రొడక్షన్స్, అరుణ గిరి ఆర్ట్స్ బ్యానర్ల మీద ఉన్నం రమేష్, నర్సింహ గౌడ్ నిర్మించారు.

మణికాంత్, ఐరా బన్సాల్ జంటగా నటించిన చిత్రం ‘ఫైటర్ శివ’. ప్రభాస్ నిమ్మల దర్శకత్వం వహించారు. కౌండిన్య ప్రొడక్షన్స్, అరుణ గిరి ఆర్ట్స్ బ్యానర్ల మీద ఉన్నం రమేష్, నర్సింహ గౌడ్ నిర్మించారు.  శనివారం  ఈ సినిమా  టీజర్‌ను ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ రిలీజ్ చేశారు. ‘యముడుకి పోలీస్ ఉద్యోగం దొరికితే ఎలా ఉంటుందో చూపిస్తా..’, ‘నేను పవన్ కళ్యాణ్ లెక్క.. గెలిచే వరకు పోరాడుతా’ వంటి పవర్ ఫుల్ డైలాగ్స్‌తో ‘ఫైటర్ శివ’ టీజర్‌‌ను అద్భుతంగా కట్ చేశారు.  


హీరో మణికాంత్ మాట్లాడుతూ 'నన్ను హీరోని చేయాలని ఈ ‘ఫైటర్ శివ’ కోసం మా నాన్న గారు చాలా కష్టపడ్డారు. పెట్టిన ప్రతీ రూపాయిని వడ్డీతో సహా ఇండస్ట్రీ నుంచి తీసుకు వెళ్తాను. ఈ ప్రయాణం అంత సులభంగా జరగలేదు. మధ్యలో ఇరుక్కుపోయిన మమ్మల్ని రమేష్ గారు ఒడ్డుకు తీసుకు వచ్చారు. ప్రభాస్ గారికి కమర్షియల్ చిత్రాలంటేనే చాలా ఇష్టం. ఇందులోని ప్రతీ డైలాగ్ అద్భుతంగా ఉంటుంది. ‘ఫైటర్ శివ’ అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది’ అని అన్నారు.


దర్శకుడు ప్రభాస్ నిమ్మల మాట్లాడుతూ ' నేను ఇప్పుడు చిన్న సినిమా తీస్తున్నాను కావొచ్చు.. భవిష్యత్తులో మాత్రం నేను పెద్ద దర్శకుడిని అవుతాను. అప్పుడు నా వద్దకు సాయం కోసం వచ్చే కొత్త వారికి కచ్చితంగా అందుబాటులో ఉంటాను. ఓ సందేశాత్మకంగా చిత్రంగా ‘ఫైటర్ శివ’ను తెరకెక్కించాం. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా మన ప్రభుత్వాలు ఎంతో ప్రయత్నిస్తున్నాయి. టైటిల్ రోల్‌లో మణికాంత్ నటించారు. సునీల్ గారు, వికాస్ వశిష్ట వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు. చిన్న సినిమాల్ని, కొత్త వారిని ఇండస్ట్రీలో ప్రోత్సహించాలి. ‘మిరాకిల్’ అనే ఓ చిత్రాన్ని కూడా చేయబోతోన్నాను. అది కూడా త్వరలోనే ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. యాక్షన్, మాస్, కమర్షియల్, మెసెజ్ ఓరియెంటెడ్ ‘ఫైటర్ శివ’ సబ్జెక్ట్ చెప్పాను. రమేష్ గారు మా వెన్నంటే నిల్చున్నారు. తెలంగాణ నుంచి మణికాంత్ అనే స్టార్ హీరో రాబోతోన్నాడు' అని అన్నారు.

నిర్మాత నర్సింహా గౌడ్ మాట్లాడుతూ .. ‘నేను చాలా కథలు విన్నాను.  ఓ టైంలో ప్రభాస్ గారు ఈ ‘ఫైటర్ శివ’ స్టోరీ చెప్పారు. ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు డ్రగ్స్ మీద పోరాడుతున్నారు. అదే సందేశాన్ని ఈ మూవీతో మేం ఇవ్వబోతోన్నాం. యువతను మేల్కొపేలా మా ‘ఫైటర్ శివ’ ఉంటుంది. త్వరలోనే ఈ మూవీ విడుదల కాబోతోంది. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా మా చిత్రం ఉంటుంది’ అని అన్నారు.

Updated Date - Aug 17 , 2025 | 07:58 AM