Priyanka Chopra: ఇక్కడే ఎందుకు ఉంటున్నానో ఆ రోజు తెలుస్తుంది
ABN, Publish Date - Nov 10 , 2025 | 06:36 PM
మహేష్, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘ఎస్‌ఎస్‌ఎంబీ 29’(SSMB29) ఈవెంట్‌ను భారీ స్థాయిలో నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు హీరోయిన్ ప్రియాంక చోప్రా కూడా ఓ వీడియో వదిలారు.
మహేష్, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘ఎస్‌ఎస్‌ఎంబీ 29’(SSMB29) ఈవెంట్‌ను భారీ స్థాయిలో నిర్వహించనున్న సంగతి తెలిసిందే. రామోజీ ఫిల్మ్ సిటీ (Ramoji Film City) వేదికగా శనివారం సాయంత్రం వేడుక ప్రారంభం కానుంది. షో వివరాలు ఇటీవల మహేష్ బాబు ఓ వీడియో ద్వారా తెలిపారు. ఇప్పుడు హీరోయిన్ ప్రియాంక చోప్రా కూడా ఓ వీడియో వదిలారు. ప్రోగ్రాం వివరాలను వీడియో ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ‘నేనెందుకు ఎప్పుడూ హైదరాబాద్‌లో ఉంటున్నానో నవంబరు 15న తెలుస్తుంది. అందరు మాతో జాయిన్ అవ్వండి. ఈ ఈవెంట్ ‘జియో హాట్‌స్టార్’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది’ అని తెలిపారు. ఈ వేడుకలో టైటిల్‌ని ప్రకటిస్తూ గ్లింప్స్ విడుదల చేయనున్నారని తెలిసింది.
'ఎస్ఎస్ఎంబి29'తో బిజీ గా ఉన్న ప్రియాంక ఇటీవల ఓ పాట కోసం సింగర్ అవతారం ఎత్తింది. 10 నెలల క్రితం విడుదలై అంతర్జాలాన్ని ఒక ఊపు ఊపిన ప్రఖ్యాత వామ్ రాసిన లాస్ట్ క్రిస్మస్ పాటకు ఆమె తన గాత్రాన్ని అందించారు. లాస్ట్ క్రిస్మస్ దేశీ వెర్షన్ ని ప్రియాంక చోప్రా ఆలపించారు. ఈ విషయంలో ఆమె తీవ్రమైన ట్రోల్స్ ని ఎదుర్కోవాల్సి వచ్చింది. 'ఇప్పటివరకు అత్యంత పాపులర్ క్రిస్మస్ పాటలలో ఒకదాన్ని ప్రియాంక ఖూనీ చేసిందని ఆరోపించారు. మరికొందరు ట్రాక్ అతిగా ఆటో-ట్యూన్ చేయడంతో ప్రియాంక చోప్రా స్వరం వాస్తవంగా వినిపించడం లేదని కామెంట్ చేశారు. దీనిని అంత తేలిగ్గా తీసుకోలేదు. ట్రోలర్స్ కు తనదైన శైలిలో కౌంటర్ వేసింది. తాజాగా ఇన్ స్టాలో ఒక క్రిప్టిక్ పోస్ట్ ని షేర్ చేసింది. చాలా మంది నన్ను వారిలాగా ఉండటానికి ప్రేరేపించారు అని కౌంటర్ మెసేజ్ ని పోస్ట్ చేసింది. అయితే ఇది ట్రోలర్లకు చెక్ పెట్టేందుకు ప్రియాంక మెసేజ్ అంటూ కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. క్రిస్మస్ కర్మ అంటూ సాగే ఈ పాటను తన స్నేహితురాలు గురీందర్ చద్దా కోసం పాడానని కూడా ఆమె వెల్లడించారు. నా స్థాయిలో చిన్నగా ఆమెకు మద్ధతునిచ్చేందుకు పాడానని కూడా వివరణ ఇచ్చారు. మనలో చాలా మందికి క్రిస్మస్ సౌండ్‌ట్రాక్‌గా ఉన్న ఈ పాటకు దేశీ ట్విస్ట్ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని నేను ఆశిస్తున్నాను అని అంది.