సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Premante Trailer: సారం లేని సంసారం వద్దు.. విడాకులే ముద్దు..

ABN, Publish Date - Nov 17 , 2025 | 07:55 PM

కుర్ర హీరో ప్రియదర్శి (Priyadarshi), ఆనంది (Anandi) జంటగా నవనీత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ప్రేమంటే (Premante).. థ్రిల్లు ప్రాప్తిరస్తు అనేది ట్యాగ్ లైన్.

Premante

Premante Trailer: కుర్ర హీరో ప్రియదర్శి (Priyadarshi), ఆనంది (Anandi) జంటగా నవనీత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ప్రేమంటే (Premante).. థ్రిల్లు ప్రాప్తిరస్తు అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమాను జాన్వీ నారంగ్ మరియు పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో యాంకర్ సుమ కనకాల, వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. మధుసూదన్ రావు .. ఒక నైట్ షిఫ్ట్ ఉద్యోగి. జాబ్ వచ్చినదగ్గర నుంచి పెళ్లి చేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ ఏది సెట్ అవ్వదు. చివరికి రమ్యతో మధికి పెళ్లి అవుతుంది. పెళ్లి తరువాత మధి పూర్తిగామారిపోతుంది. భార్య రమ్యకు అనుమానం ఎక్కువ. ఉద్యోగానికి వెళ్లినా వేరే అమ్మాయి దగ్గరకు వెళ్లావని టార్చర్ పెడుతుంటుంది. ఆమె గురించి పూర్తిగా తెలుసుకోకుండా పెళ్లి చేసుకొని మధి ఎన్ని పాట్లు పడ్డాడు.. అసలు రమ్యకు ఉన్న సమస్య ఏంటి.. ఈ జంట మధ్యలోకి వచ్చి విడాకులు తీసుకోండి అని పోరు పెడుతున్న లేడీ కానిస్టేబుల్ ఎవరు.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు సాధారణమే. ఆ గొడవల్లో థ్రిల్ వెతుక్కొనే అమ్మాయి భార్యగా వస్తే.. ఇదే కథగా ప్రేమంటే వస్తుందని అర్ధమవుతుంది. టోటల్ గా సినిమా కామెడీ ఎంటర్ టైనర్ అని తెలుస్తోంది. ఇక లియోన్ జేమ్స్ మ్యూజిక్ చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది. సుమ కామెడీ హైలైట్ గా నిలవనుందనిపిస్తుంది. ఇక ఈ సినిమా నవంబర్ 21 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో ప్రియదర్శి ఎలాంటి విజయాన్ని అందుకుంటాడు అనేది చూడాలి.

Updated Date - Nov 17 , 2025 | 07:55 PM