Globe Trotter: రూత్‌లెస్, క్రూయల్.. కుంభా! రాజమౌళి SSM29 నుంచి ఫస్ట్ అప్డేట్ వచ్చేసింది
ABN, Publish Date - Nov 07 , 2025 | 12:51 PM
గ్లోబ్ ట్రోటర్‌గా ఇప్పటికే యావత్ దేశాన్ని కమ్మేసిన చిత్రం SSM29. ఈ చిత్రం నుంచి రూత్‌లెస్, క్రూయల్.. ప్రతినాయకుడు కుంభా లుక్‌ను రివీల్ చేశారు.
గ్లోబ్ ట్రోటర్‌గా ఇప్పటికే యావత్ దేశాన్ని కమ్మేసిన చిత్రం SSM29. రాజమౌళి (ss rajamouli), మహేశ్ బాబు (Mahesh Babu), ప్రియాంక చోప్రా ( priyanka chopr)ల కలయుకలో వస్తున్న ఈ చిత్రంపై ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే అశకు మమించిన అంచనాలు ఉన్నాయి. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం గురించిన విషయాలను మొదటి సారి అధికారికంగా తెలియజేయడానికి మేకర్స్ తాజాగా ఓ ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు ప్రకటన రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.
ఇందులో భాగంగా నవంబర్ 15న రామోజీ ఫిలింసిటీలో భారీ ఈవెంట్ నిర్వహించి సినిమాకు సంబంధించి అనేక విషయాలను వెళ్లడించనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో సినిమాలో నటిస్తు్నన ప్రధాన నటుల వివరాలను పరిచయం చేయనున్నట్లు దర్శకధీరుడు రాజమౌళి తాజాగా సోషల్ మీడియా ద్వారా వెళ్లడించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం ఈ సినిమాలో రూత్‌లెస్, క్రూయల్ ప్రతినాయకుడు కుంభా (KUMBHA) గా నటిస్తున్న మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) లుక్‌ను రివీల్ చేశారు.
ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. ఫృథ్వీతో చేసిన తొలి షాట్ చూసి నాకు తెలసిన అత్యుత్తమ నటుల్లో మీరోకరిని చెప్పానని, అంత అద్భుతంగా చేశాడని చెప్పుకొచ్చారు.కుంభా వంటి శక్తివంతమైన ప్రతినాయకుడి పాత్ర క్రియేట్ చేయడం నాకు చాలా సంతృప్తిని ఇచ్చిందన్నారు. ప్రస్తుతం ఈ లుక్ల , సినిమా అంతర్జాతీయ స్థాయిలో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది.