Prithviraj Sukumaran: ఇలాంటి టార్చరస్ షూటింగ్ నేను ఎక్కడా చూడలేదు

ABN , Publish Date - Nov 15 , 2025 | 08:56 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా వారణాసి(Varanasi).

Prithviraj Sukumaran

Prithviraj Sukumaran: సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా వారణాసి(Varanasi). ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నాడు. నేడు రామోజీ ఫిల్మ్ సిటీలో గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ ని నిర్వహిస్తున్న విషయం తెల్సిందే. ఈ ఈవెంట్ లో పృథ్వీ రాజ్ సుకుమారన్ క్యారెక్టర్ ని పరిచయం చేశారు. రణ కుంభా అనే పాత్రలో ఆయన నటిస్తున్నట్లు తెలిపారు. ఆ పాత్రకు సంబంధించి స్పెషల్ సాంగ్ ను కీరవాణి ఆలపించారు.

ఇక సాంగ్ అనంతరం పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. చిత్రబృందానికి ధన్యవాదాలు చెప్పుకొచ్చాడు. రెండు ఏళ్ళ క్రితం తాను ఒక సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సమయంలో రాజమౌళి నుంచి తనకు ఒక మెసేజ్ వచ్చిందని.. హాయ్ పృథ్వీ.. నేను రాజమౌళి.. నేను తీస్తున్న సినిమాలో ఒక విలన్ పాత్ర ఉంది. అది నువ్వు చేస్తే బావుంటుందని చెప్పారని, వెంటనే తాను కథ వినడానికి వచ్చినట్లు చెప్పాడు.

ఇక మొదటి 5 మినిట్స్ తరువాత తనకు ఒక కామిక్ చదువుతున్నట్లు అనిపించిందని చెప్పుకొచ్చాడు. అసలు ఇలాంటి ఆలోచనలు ఆయనకు ఎలా వస్తాయో అని అనుకున్నట్లు పృథ్వీ తెలిపాడు. ఇక రాజమౌళి ఇండియన్ సినిమాను మరోసారి ప్రపంచానికి పరిచయం చేయనున్నట్లు తెలిపాడు. మహేష్ పోకిరి సినిమాను థియేటర్ లో మొదటిసారి చూశానని తెలిపిన పృథ్వీ.. ఆయన లెగసీ ఎంతోమందికి ఇన్స్ పిరేషన్ అని,ఈ సినిమా మ‌హేష్ కోస‌మే.. మ‌హేష్ ఉన్న‌ది ఈ సినిమా కోస‌మే అని చెప్పాడు. ఈ సినిమాలో తన పాత్ర చాలా భయపెడుతుందని, రాజమౌళిలా టార్చర్ పెట్టే షూటింగ్ ఇంకెక్కడా చూడలేదు అని చెప్పుకొచ్చాడు.

Updated Date - Nov 15 , 2025 | 10:05 PM