సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Kota Srinivasarao: కోట మృతి.. సంతాపం తెలిపిన ప్రధాని మోదీ

ABN, Publish Date - Jul 13 , 2025 | 06:07 PM

విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు(Kota Srinivasarao)నేటి ఉదయం మృతి చెందిన విషయం తెల్సిందే. వయో వృద్ధాప్య సమస్యలతో పోరాడుతూ ఆయన నేటి ఉదయం తుదిశ్వాస విడిచారు.

Kota Srinivasarao

Kota Srinivasarao: విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు(Kota Srinivasarao)నేటి ఉదయం మృతి చెందిన విషయం తెల్సిందే. వయో వృద్ధాప్య సమస్యలతో పోరాడుతూ ఆయన నేటి ఉదయం తుదిశ్వాస విడిచారు. దీంతో ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, వెంకటేష్, మురళీ మోహన్, సీఎం చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు, అనిల్ రావిపూడి, బ్రహ్మానందం, బాబు మోహన్ తదితరులు కోట భౌతికాయానికి నివాళులు అర్పించి.. కోటతో ఉన్న అనుబంధాన్నీ పంచుకున్నారు.


ఇక చాలామంది సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా కోటకు సంతాపం తెలుపుతున్నారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ.. సోషల్ మీడియా ద్వారా కోటకు సంతాపం తెలిపారు. 'కోట శ్రీనివాసరావు గారి మరణం బాధాకరం. ఆయన సినీ ప్రతిభ, బహుముఖ ప్రజ్ఞకు గుర్తుండిపోతారు. తరతరాలుగా ప్రేక్షకులను తన అద్భుతమైన ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. సామాజిక సేవలో కూడా ఆయన ముందంజలో ఉన్నారు మరియు పేదలు మరియు అణగారిన వర్గాలకు సాధికారత కల్పించడానికి కృషి చేశారు. ఆయన కుటుంబానికి, అసంఖ్యాక అభిమానులకు నా సంతాపం. ఓం శాంతి' అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

Updated Date - Jul 13 , 2025 | 06:09 PM