Kannappa Promotions: అవన్నీ వద్దు.. ప్రభాస్ వస్తున్నాడా.. ?
ABN, Publish Date - Jun 02 , 2025 | 02:15 PM
ప్రస్తుతం ఇండస్ట్రీలో అందరి చూపు కన్నప్ప(Kannappa) సినిమాపైనే ఉంది. మంచు విష్ణు(Manchu Vishnu) హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మంచు మోహన్ బాబు(Manchu Mohan Babu) ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు.
సినిమా ఎంత బడ్జెట్ తో తీసామన్నది ముఖ్యం కాదు. ఆ సినిమాను జనాల్లోకి ఎంతవరకు తీసుకెళ్ళామనేది ఎంతో ముఖ్యం. అందుకే ఈ మధ్య మేకర్స్ అందరూ.. సినిమా కన్నా ఎక్కువగా ప్రమోషన్స్ మీదనే డబ్బులు ఖర్చు పెడుతున్నారు. స్టార్ హీరో, పెద్ద బ్యానర్, సూపర్ హీరోయిన్.. ఇవేమి ఇప్పుడు ప్రేక్షకులు చూడడం లేదు. కథ బావుందా.. ? ప్రమోషన్స్ బాగా చేస్తున్నారా.. ? ఇవే చూస్తున్నారు. స్టార్ హీరోలు సైతం ఈ ప్రమోషన్స్ పై బాగా ఫోకస్ చేస్తున్నారు.
ప్రస్తుతం ఇండస్ట్రీలో అందరి చూపు కన్నప్ప(Kannappa) సినిమాపైనే ఉంది. మంచు విష్ణు(Manchu Vishnu) హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మంచు మోహన్ బాబు(Manchu Mohan Babu) ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఎలాగైనా ఈ సినిమాతో మంచు విష్ణును ఇండస్ట్రీలో నిలబెట్టాలని మోహన్ బాబు ప్రయత్నిస్తున్నాడు. దానికోసమే ఒక్కో ఇండస్ట్రీ నుంచి ఒక్కో స్టార్ హీరోను దింపి క్యామియోగా చూపించబోతున్నాడు.
బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్(Akshay Kumar), మాలీవుడ్ నుంచి మోహన్ లాల్(Mohan Lal), కోలీవుడ్ నుంచి శరత్ కుమార్.. ఇక టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) ను రంగంలోకి దింపాడు. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి విమర్శలను ఎదుర్కొంటూనే ఉంది. మధ్యలో మంచు బ్రదర్స్ గొడవ. ఇక ఈ మధ్యనే హార్డ్ డిస్క్ వివాదం బయటపడింది. ఇన్ని వివాదాల్లో కూడా కన్నప్ప సినిమాపై అభిమానులు అంచనాలను పెట్టుకున్నారు అంటే అది కేవలం ప్రభాస్ కోసమే.
ఎన్నో వాయిదాల తరువాత కన్నప్ప జూన్ 27 న రిలీజ్ కు రెడీ అవుతోంది. పోస్టర్స్, టీజర్ అన్ని ట్రోల్స్ కు గురైనా.. శివ శివ శంకర సాంగ్ మాత్రం మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో విష్ణు ప్రమోషన్స్ వేగాన్ని పెంచేశాడు. ప్రమోషన్స్ మొత్తం తన భుజంపై మోయకుండా దీనికి కూడా స్టార్స్ హెల్ప్ అడిగాడు. సినిమాకు తగ్గట్టే ప్రమోషన్స్ కూడా ఎక్కడా తగ్గకుండా గట్టిగా ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది.
కన్నప్ప ట్రైలర్ లాంచ్(Kannappa Trailer) .. ఇండోర్ లో చాలా గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. ఇది కాకుండా బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ మీడియా సమావేశం ఉండనుంది. కొచ్చిలో మోహన్ లాల్ సైతం కన్నప్ప ప్రమోషన్స్ లో పాల్గొననున్నాడు. తెలుగులో మంచు విష్ణు, మోహన్ బాబు ఇద్దరూ ఇంటర్వ్యూలు ఇవ్వడం మొదలుపెట్టారు. అయితే వీరందరూ కంటే.. డార్లింగ్ ప్రభాస్ మీడియా ముందు కనిపిస్తే అంతకుమించి పెద్ద ప్రమోషన్ లేదనే చెప్పాలి.
ప్రభాస్ కోసమే కన్నప్ప సినిమా చూసేవాళ్లే ఎక్కువమంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ప్రభాస్ కూడా కన్నప్ప ప్రమోషన్స్ లో ఉంటే బావుండు అని, అతనొక్కడు కనిపిస్తే చాలు అని అభిమానులు కోరుకుంటున్నారు. ఇన్ని ఈవెంట్స్ ప్లాన్ చేయాల్సిన అవసరం లేదు. ప్రభాస్ వస్తే చాలు అని డార్లింగ్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
అయితే తన సొంత సినిమా ప్రమోషన్స్ కే రానీ డార్లింగ్.. క్యామియో చేసిన సినిమా ప్రమోషన్స్ కు వస్తాడా.. ? అంటే నిర్మొహమాటంగా రాడు. ఈ క్యామియో కూడా మోహన్ బాబు మీద ఉన్న అభిమానాన్ని చంపుకోలేకా.. రూపాయి కూడా తీసుకోకుండా చేశాడు. ఇప్పుడు అదే అభిమానం తో ప్రమోషన్స్ కు వస్తాడా అంటే రాడు అనే చెప్పాలి. కన్నప్ప ప్రమోషన్స్ ప్రభాస్ లేకుండానే జరగనున్నాయని తెలుస్తోంది. మరి ప్రభాస్ ఇమేజ్ తో సంబంధం లేకుండా మంచు విష్ణు కన్నప్ప ప్రమోషన్స్ ను ఎలా సక్సెస్ చేస్తాడు అనేది చూడాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.