Prabhas: కోట్ల మార్కెట్‌ను శాసిస్తున్న రెబల్‌స్టార్..
ABN, Publish Date - Dec 11 , 2025 | 07:10 PM
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ఈపేరు ఇపుడు ఇండియన్ బాక్సాఫీస్‌నే షేక్ చేస్తుంది. ప్రభాస్ తో ఏ సినిమా తీసినా నిర్మాతలకు మినిమమ్ గ్యారంటీ అనేలా కాసుల వర్షం కురిపిస్తున్నాయి.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas).. ఈపేరు ఇపుడు ఇండియన్ బాక్సాఫీస్‌నే షేక్ చేస్తుంది. ప్రభాస్ తో ఏ సినిమా తీసినా నిర్మాతలకు మినిమమ్ గ్యారంటీ అనేలా కాసుల వర్షం కురిపిస్తున్నాయి. 'బాహుబలి'తో (bahubali) భారతీయ సినిమా సరిహద్దులను చెరిపేసిన మన డార్లింగ్, ప్రస్తుతం చేతి నిండా భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఆదిపురుష్ తర్వాత నుంచి తన సినిమాల వేగాన్ని మరింత పెంచిన ప్రభాస్, ఈ ఏడాది కన్నప్పతో మాత్రమే ప్రేక్షకులను పలకరించగలిగాడు అది కూడా గెస్ట్ రోల్‌తో. అయితే, ప్రభాస్ సినిమా ఆలస్యమైనా, ఆయనకు ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం ప్రభాస్‌పై ట్రేడ్ సర్కిల్స్‌లో జరుగుతున్న బిజినెస్ అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మడం ఖాయం.
ఆయన చేయబోతున్న, చేస్తున్న సినిమాల మొత్తం మార్కెట్ విలువ ప్రస్తుతం 5 వేల కోట్ల నుంచి 10 వేల కోట్ల మధ్య ఉంటుందని సినీ పండితులు అంచనా వేస్తున్నారు. ఇది భారతీయ సినిమాలో మరే హీరోకు లేని రేంజ్ అని చెప్పక తప్పదు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న ప్రతి ప్రాజెక్ట్ ఒక అద్భుతమే అని చెప్పాలి. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానున్న రాజాసాబ్ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇప్పటికే ఈ చిత్రం బిజినెస్ పరంగా క్లోజ్ అయినట్లు టాక్. ఒకవేళ ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే... బాక్సాఫీస్ వద్ద 800 నుంచి వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్లు రావడం ఖాయమని ట్రేడ్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మారుతి దర్శకత్వంలో వస్తున్న ఈ పక్కా మాస్ ఎంటర్‌టైనర్ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
'సీతారామం'తో మనసును కదిలించిన హను రాఘవపూడి దర్శకత్వంలో రాబోతున్న ఫౌజీ చిత్రంపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ ప్రేక్షకులను కట్టిపడేయనుందని తెలుస్తోంది. బిజినెస్ పరంగా ఈ సినిమా కూడా సుమారు 800 కోట్ల మార్కును సులభంగా దాటేయగలదని అంచనా. ప్రభాస్ కెరీర్‌లో భారీ హిట్స్‌గా నిలిచిన సినిమాల సీక్వెల్స్... సలార్-2, కల్కి 2898 AD పార్ట్-2.. ఈ రెండు చిత్రాలపైనా ప్రపంచవ్యాప్తంగా కనీసం రూ. 1000 కోట్ల బిజినెస్ జరిగే అవకాశం ఉంది. ప్రశాంత్ నీల్, నాగ్ అశ్విన్ వంటి విజనరీ డైరెక్టర్లతో కూడిన ఈ ప్రాజెక్టులు బాక్సాఫీస్‌ను షేక్ చేయడం గ్యారంటీ. వీటన్నిటికంటే ఎక్కువగా ప్రభాస్ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట చేస్తున్న చిత్రం స్పిరిట్. మిగతా చిత్రాల కన్నా సందీప్ రెడ్డికి ఉన్న ట్రాక్ దృష్ట్యా దీని బిజినెస్ రేంజ్ ఇతర చిత్రాల కంటే చాలా రెట్లు ఎక్కువగా ఉండబోతుందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ఈ కాంబినేషన్ ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక కొత్త రికార్డు సృష్టిస్తుందని ఆశించవచ్చు.