The Raja Saab: గ్రీస్ లో రెబల్ స్టార్ ప్రభాస్...
ABN, Publish Date - Oct 10 , 2025 | 04:28 PM
రెబల్ స్టార్ ప్రభాస్ చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ద రాజాసాబ్ మూవీ కోసం గ్రీస్ లో చిత్రీకరిస్తున్న పాటలో పాల్గొంటున్నాడు ప్రభాస్. తాజాగా ప్రభాస్ సుకుమార్ తో కూడా సినిమా చేయబోతున్నాడనే వార్తలు ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతున్నాయి.
రెబల్ స్టార్ ప్రభాస్ 'ద రాజాసాబ్'గా పొంగల్ బరిలో దూకడానికి సిద్ధమవుతున్నారు. ఫ్యాన్స్ అందరూ 'ద రాజాసాబ్' కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గ్రీస్ లో ఈ సినిమా పాటల చిత్రీకరణ సాగుతోంది. ఓ పాటలోని ప్రభాస్ లుక్ లీకయింది. రెబల్ స్టార్ ను ఆ లుక్ లో చూసిన ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.
ప్రస్తుతం ప్రభాస్ చేతినిండా సినిమాలున్నాయి. ఏ సినిమా ఎప్పుడు వచ్చినా చూడటానికి ఫ్యాన్స్ సిద్ధంగా ఉన్నారు.. ఎందుకంటే ఈ యేడాది ప్రభాస్ నటించిన ఒక్క సినిమా కూడా జనం ముందుకు రాలేదు. ఈ నెల 31న 'బాహుబలి ది ఎపిక్' తోనే మరో మారు ప్రేక్షకులను పలకరించనున్నారు ప్రభాస్. ఆ సినిమా ఎటూ చూసిందే - కానీ, రెండు భాగాలు కలిపి ఒకే పార్ట్ గా 'బాహుబలి ది ఎపిక్' సందడి చేయనుంది. అదలా ఉంచితే ప్రభాస్ రాబోయే సినిమా 'ద రాజాసాబ్' కోసం గ్రీస్ లో పాటల చిత్రీకరణ సాగుతోంది. ఓ పాటలో రెడ్ కలర్ షర్ట్ వేసుకొని కళ్ళజోడు పెట్టుకొని ప్రభాస్ హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారు. ఆ పాటలో ప్రభాస్ లుక్ ను కావాలని లీక్ చేశారో, లేక ఎవరైనా క్లిక్ చేసి నెట్టింట పెట్టారో తెలియదు కానీ, ఆ లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
'ద రాజాసాబ్' కాగానే ప్రభాస్ రెండు చిత్రాల షూటింగ్స్ లో పాలు పంచుకుంటారని తెలుస్తోంది. సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించే 'స్పిరిట్'లోనూ, తరువాత ప్రశాంత్ వర్మ రూపొందించే 'బ్రహ్మరాక్షస్'లోనూ ప్రభాస్ పాలు పంచుకుంటారని సమాచారం. ఈ రెండు సినిమాలే కాకుండా 'కల్కి పార్ట్ 2' కూడా ప్రభాస్ నటించనున్నారు. అలాగే హను రాఘవపూడి మూవీ 'ఫౌజీ'లోనూ ప్రభాస్ నటించాల్సి ఉంది. 'సలార్ -2' కూడా ప్రభాస్ పూర్తి చేయాలి. ఇన్ని సినిమాలు ఉన్నా, ప్రభాస్ మరో సినిమాకు ఓకే అన్నారని విశేషంగా వినిపిస్తోంది. ఆ మూవీని సుకుమార్ తెరకెక్కిస్తారని తెలుస్తోంది.
ప్రభాస్ పలు చిత్రాలు చేతిలో పెట్టుకొని సుకుమార్ సినిమాలో నటిస్తారా? అన్న అనుమానాలూ లేకపోలేదు. సుకుమార్ ఫిబ్రవరిలో రామ్ చరణ్ తో సినిమా పట్టాలెక్కిస్తారు. తరువాత ఆయన 'పుష్ప-3'ని తెరకెక్కించాల్సి ఉంది. అయితే అల్లు అర్జున్ అట్లీ మూవీ పూర్తి చేసుకొని వచ్చే సరికి మరింత సమయం పడుతుంది. ఈ గ్యాప్ లోనే ప్రభాస్ తో సుకుమార్ సినిమా ఉంటుందని అంటున్నారు. ప్రభాస్ - సుకుమార్ కాంబో అనగానే ఓ స్పెషల్ బజ్ నెలకొంటుందని చెప్పవచ్చు. ప్రభాస్ ఒకే సమయంలో ప్లాన్ ప్రకారం రెండు సినిమాలు కంప్లీట్ చేసే ప్రణాళిక రూపొందించుకున్నారనీ తెలుస్తోంది. కాబట్టి సుకుమార్ సినిమాకు తగిన సమయాన్ని కేటాయిస్తారనీ సమాచారం. ప్రభాస్ తో సుకుమార్ ఓ హెవీ డోస్ యాక్షన్ మూవీని తెరకెక్కిస్తారనీ వినికిడి. మరి ప్రభాస్ - సుకుమార్ సినిమా ఎప్పుడు సెట్స్ కు వెళ్తుందో చూడాలి.
Also Read: Ari Movie Review: అరి మూవీ రివ్యూ
Also Read: Tollywood: పెద్దలకు మాత్రమే 'ఎర్రచీర'