సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Prabhas: మాటలతో.. మనసు గెలుచుకున్న ప్రభాస్!

ABN, Publish Date - Dec 28 , 2025 | 06:57 PM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే మనందరికీ ఒకటే గుర్తుకొస్తుంది.. స్టేజ్ మీద చాలా తక్కువగా మాట్లాడే ఒక సైలెంట్ డార్లింగ్. ఆయన బిడియం వల్ల కావచ్చు, లేదా ఆయన వ్యక్తిత్వం వల్ల కావచ్చు.. ప్రభాస్ పూర్తి స్థాయిలో ఓపెన్ అవ్వడం చాలా అరుదుగా చూస్తుంటాం.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) అంటే మనందరికీ ఒకటే గుర్తుకొస్తుంది.. స్టేజ్ మీద చాలా తక్కువగా మాట్లాడే ఒక సైలెంట్ డార్లింగ్. ఆయన బిడియం వల్ల కావచ్చు, లేదా ఆయన వ్యక్తిత్వం వల్ల కావచ్చు.. ప్రభాస్ పూర్తి స్థాయిలో ఓపెన్ అవ్వడం చాలా అరుదుగా చూస్తుంటాం. కానీ 'ది రాజా సాబ్' ఈవెంట్‌లో మాత్రం సీన్ మొత్తం మారిపోయింది. ఒక కొత్త డార్లింగ్‌ను చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఆ మార్పు కేవలం కొత్త లుక్‌లోనే కాదు, ఆయన మాటల్లోనూ స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా ఆ గుబురు గడ్డం, వెనుక చిన్న పిలకతో 'స్పిరిట్' గెటప్‌ను రివీల్ చేయడంతో అభిమానులకు అసలైన కిక్ వచ్చింది. ఎప్పటిలాగే "డార్లింగ్స్ ఐ లవ్ యు" అంటూ మొదలుపెట్టి, ఒక్కొక్కరి గురించి ప్రభాస్ మాట్లాడిన తీరు చాలా స్పెషల్ అనిపించింది. నిర్మాత విశ్వప్రసాద్ గారిని ఈ సినిమాకు అసలు హీరో అని ఆకాశానికి ఎత్తేశారు. అలాగే, థమన్ తన అద్భుతమైన మ్యూజిక్ వర్క్‌తో ఈ సినిమాకు ప్రాణం పోస్తున్నారని ప్రభాస్ కితాబిచ్చారు.

ఇక సంక్రాంతి రేసు గురించి ప్రభాస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. "పండక్కి వచ్చే సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ అవ్వాలి.. ముఖ్యంగా మా సీనియర్ల సినిమాలు బాగా ఆడాలి.. వారి తర్వాతే మేము.. వారిని చూసే మేము ఎన్నో విషయాలు నేర్చుకున్నాం" అంటూ చిరంజీవి, వెంకటేష్ వంటి స్టార్లపై తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు. అలాగే రవితేజ, శర్వానంద్, నవీన్ పొళిశెట్టి సినిమాలు కూడా పోటీలో ఉన్నాయి కాబట్టి, అందరికీ విజయం కలగాలని కోరుకోవడం డార్లింగ్ సంస్కారానికి నిదర్శనం.

మరోవైపు దాదాపు 15 ఏళ్ల తర్వాత దర్శకుడు మారుతి తన మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో థియేటర్లను ఊపేయబోతున్నారని ప్రభాస్ చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పారు. చివరగా, అంత చలిలో కూడా తన కోసం వచ్చిన అభిమానుల ఆరోగ్యం గురించి ఆలోచించి.. "ఇబ్బంది పడకండి" అని చెప్పడం అందరి మనసులను గెలుచుకుంది. ఇక రాజా సాబ్ కంటెంట్ మీద అంత నమ్మకం ఉంది కాబట్టే ప్రభాస్ అంత ఓపెన్ గా మాట్లాడరని, అభిమానులు, సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. నిర్మాత కె.ఎన్ చెప్పినట్లు, ఈసారి పందెం కోళ్ల మీద కాదు, నేరుగా డైనోసార్ మీద అన్న మాట వాస్తవం కానున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలంటే మరో రెండు వారాలు ఎదురుచూడాల్సిందే..

Updated Date - Dec 28 , 2025 | 09:29 PM