The Raja Saab: ప్రభాస్.. ది రాజా సాబ్ టీజర్ వచ్చేసింది!
ABN, Publish Date - Jun 16 , 2025 | 10:51 AM
ఎడాదిగా ప్రభాస్ రాజా సాబ్ మూవీ నుంచి అప్డేట్ ఎప్పెడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్, సినీ లవర్స్ కోరికకు ఎట్టకేలకు ఎండ్ కార్డ్ పడింది.
దాదాపు ఓ ఎడాదిగా ప్రభాస్ (Prabhas) రాజా సాబ్ (The Raja Saab) మూవీ నుంచి అప్డేట్ ఎప్పెడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్, సినీ లవర్స్ కోరికకు ఎట్టకేలకు ఎండ్ కార్డ్ పడింది. హైదరాబాద్ ప్రసాద్ ఐ మాక్స్ లో ఉదయం 10.51 నిమిషాలకు ది రాజా సాబ్ టీజర్‌ను విడుదల చేశారు. ప్రభాస్ మొట్ట మొదటి సారి హర్రర్ జానర్, డబుల్ రోల్ చేయడం, ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ మరింత ఆసక్తిని రేకెత్తించాయి.
ఇప్పటికే.. ముందస్తుగా రిలీజ్ చేసిన ప్రీ టీజర్ సెన్షేషన్ అవగా తాజాగా సోమవారం విడుదల కానున్న టీజర్పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ ప్రీ టీజర్ లో కథానాయికలు మాళవిక మోహనన్ (Malavika Mohanan), నిధి అగర్వాల్ (Nidhhi Agerwal), రిద్ది కుమార్ (Riddhi Kumar) సహా చాలా మంది ఆకాశాన్ని చూస్తూ షాక్ కు గురి అవుతున్నట్లు చూయించారు. ఆ షాట్ సోషల్ మీడియాలోహైలైట్ అయింది. అయితే టీజర్ విడుదల సందర్బంగా ఐమాక్స వద్ద జాతర వాతావరణం ఏర్పడింది. వేలల్ఓ ప్రభాస్‌ఫ్యాన్స్ తరలి వచ్చి అక్కడ ప్రభాస్ చిత్ర పటాలకు పాలాభిషేకం చేయడంతో పాటు పెద్దెత్తున బాణా సంచా పేల్చి హంగామా చేశారు.
ఇదిలాఉంటే.. సినిమా టీజర్‌ను చూస్తే అభిమానులకు ఓ పండగే అనేలా ఉంది. హర్రర్ సీక్వెన్సులు, కామెడీ బాగా వర్కౌట్ అయినట్లు తెలుస్తుంది. విజువల్స్, తమన్ సంగీత కూడా సినిమా రేంజ్‌ను అమాంతం పెంచేలా ఉన్నాయి. ప్రభాస్ ఈ సినిమాలో తాతమనవడిగా డబుల్ రోల్ చేస్తుండగా ఆయన సరసన నిధి ఆగర్వాల్, మాళవికా మోహనన్, రిద్ధి కుమార్ నటిస్తున్నారు. కామెడీ హర్రర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మారుతి (Director Maruthi) డైరెక్ట్ చేయగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై విశ్వ ప్రసాద్ నిర్మించారు. డిసెంబర్5న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.