Prabhas: ప్రభాస్ - ప్రేమ్ రక్షిత్ కాంబో.. అసలు కథ ఇది
ABN, Publish Date - Nov 15 , 2025 | 03:29 PM
పాన్ ఇండియా ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. కొన్ని సినిమాలు రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి.. ఇంకొన్ని సెట్స్ మీదకు వెళ్ళడానికి రెడీ అవుతున్నాయి..
Prabhas: పాన్ ఇండియా ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. కొన్ని సినిమాలు రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి.. ఇంకొన్ని సెట్స్ మీదకు వెళ్ళడానికి రెడీ అవుతున్నాయి.. మరికొన్ని కథలు ఓకే అయ్యి డార్లింగ్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నాయి. ఇవి కాకుండా కొంతమంది డైరెక్టర్లు ప్రభాస్ తో సినిమా చేయడానికి కథలను సిద్ధం చేసే పనిలో ఉన్నారు. ఇలా డార్లింగ్ దాదాపు రెండు మూడేళ్ళ వరకు ఖాళీ అనే మాటనే వినలేనేంత బిజీగా ఉన్నాడు.
ఇక తాజాగా ప్రభాస్.. మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఉదయం నుంచి వార్తలు వైరల్ గా మారుతున్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ కు కొరియోగ్రఫీ కేటగిరిలో ఆస్కార్ అందుకున్న కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ డైరెక్టర్ గా ప్రభాస్ ఒక సినిమా చేస్తున్నట్టు సోషల్ మీడియాలో రూమర్స్ వచ్చాయి. ప్రభాస్ మొహమాటస్తుడు. కథ నచ్చినా నచ్చకపోయినా ఎవరైనా వచ్చి సినిమా చేద్దాం అంటే నో చెప్పలేక ఓకే చెప్పేస్తాడని, అందుకే ప్రేమ్ రక్షిత్ స్టోరీని కూడా ఒప్పుకున్నాడని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. అసలు ఈ కాంబోకు సంబంధించిన నిజం ఏంటి ..? అని అభిమానులు ఆరాలు తీయడం మొదలుపెట్టారు.
ప్రేమ్ రక్షిత్.. ప్రస్తుతం కొరియోగ్రఫీకి బ్రేక్ ఇచ్చి కొన్ని పర్సనల్ కారణాల వలన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇప్పుడు కాదు చాలా కాలం క్రితమే ప్రేమ్ రక్షిత్.. డార్లింగ్ కు ఒక యానిమేషన్ కథను చెప్పాడట. అంటే ప్రభాస్ కనిపించడు. కేవలం ఆయన వాయిస్ మాత్రమే వినిపిస్తుంది. ఇక డార్లింగ్ కి ఆ కథ నచ్చడంతో చేద్దాంలే అని చెప్పి వదిలేశారు అంట.కేవలం మాటల్లోనే ఈ ప్రాజెక్టు ఉంది కానీ, కనీసం స్క్రిప్ట్ రూపంలో కూడా ముందుకు సాగలేదట. అసలు ఈ కథనే 5 ఏళ్ల ప్రాజెక్ట్ అని, ఇది ఎప్పుడు మొదలవుతుందో.. అవుతుందో లేదో అనేది కూడా తెలియదని టాక్. దీని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదని ఇండస్ట్రీ వర్గాల టాక్. ప్రస్తుతం ప్రభాస్ ఉన్న సినిమాలను ఫినిష్ చేస్తే చాలు అనుకుంటుంటే.. ఇంకా కొత్త సినిమాలు అంటే చాలా కష్టమని అభిమానులు చెప్పుకొస్తున్నారు.