Prabhas : ఒంటరిగా నిలబడే బెటాలియన్.. ఫౌజీ పోస్టర్ అదిరిపోయింది
ABN, Publish Date - Oct 20 , 2025 | 06:55 PM
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. వచ్చే సంక్రాంతికి ది రాజాసాబ్ రిలీజ్ కు సిద్ధమవుతుండగా.. స్పిరిట్ పూజా కార్యక్రమాలను పూర్తిచేసుకోవడానికి రెడీ అవుతుంది
Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. వచ్చే సంక్రాంతికి ది రాజాసాబ్ రిలీజ్ కు సిద్ధమవుతుండగా.. స్పిరిట్ పూజా కార్యక్రమాలను పూర్తిచేసుకోవడానికి రెడీ అవుతుంది. ఈ రెండు సినిమాలు కాకుండా హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న చిత్రం పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకొని షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాకు ఫౌజీ అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు టాక్ నడుస్తోంది. ఇక ఈ సినిమాలో సోషల్ మీడియా సెన్సేషన్ ఇమాన్వి నటిస్తుండగా.. అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇప్పటివరకు పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు షేర్ చేయడం తప్ప మేకర్స్ ఈ సినిమా గురించి ఒక్క అప్డేట్ ఇచ్చింది లేదు. నేడు దీపావళీ కానుకగా మేకర్స్ ఒక పోస్టర్ ను రిలీజ్ చేసి అభిమానులకు పండగ శుభాకాంక్షలు తెలిపారు. పోస్టర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. మొదటి నుంచి ఈ సినిమాలో ప్రభాస్ ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తున్నాడు అంటూ వస్తున్న వార్తలను నిజం చేస్తూ.. యుద్ధ భూమిలో బెటాలియన్ లా నిలబడిన ప్రభాస్ నీడను చూపించారు.
గన్స్ తో నిండిపోయిన ఈ పోస్టర్ అదిరిపోయింది. వెనుక బ్యాక్ గ్రౌండ్ లో సంస్కృతంలో శ్లోకాలను రాసినట్లు తెలుస్తోంది. పద్మవ్యూహాన్ని ఛేదించే అర్జునిడిలా ప్రభాస్ కనిపించాడు. ఇక అక్టోబర్ 22 న ఒక క్రేజీ అప్డేట్ రానుందని మేకర్స్ తెలిపారు. టైటిల్ అనౌన్స్ మెంట్ అయ్యిఉంటుందని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి ప్రభాస్ బర్త్ డేకి మేకర్స్ ఎలాంటి ట్రీట్ ఇవ్వనున్నారో చూడాలి.