సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Prabhas: 'ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్' ప్రభాస్.. ఫుట్ ఫాల్స్ టాప్ 10లో.. 5 చిత్రాలు

ABN, Publish Date - Oct 30 , 2025 | 04:05 PM

ఫుట్ ఫాల్స్ ప్రకారం చూస్తే ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ అని ఒప్పుకోకతప్పదు. మొదటి రోజు అత్యధిక జనాలు చూసిన సినిమా 'బాహుబలి' కాగా... టాప్ టెన్ జాబితాలో ప్రభాస్ చిత్రాలు ఏకంగా ఐదు ఉన్నాయి.

One and Only Prabhas

ఈ మధ్య 'ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్' అంటూ ప్రభాస్ కు ట్యాగ్ పెట్టగానే కొందరు ఫ్యాన్స్ గగ్గోలు పెట్టారు. తమ హీరో టాప్ అంటే కాదు తమ హీరో బిగ్ అంటూ కేకలు వేశారు. చిత్రమేంటంటే - కొన్ని లెక్కలు ప్రభాస్ ఈజ్ ద బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని చూపిస్తున్నాయి. అవేంటో చూద్దాం...

టచ్ చేసే వారెవరు...!?

ప్రభాస్ ను 'ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్‌' అని సందీప్ రెడ్డి వంగా తన 'స్పిరిట్' టీజర్ లో పేర్కొనగానే షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ విరచుకుపడ్డారు. షారుఖ్ ఖాన్ ఉండగా ఎవరూ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ కాలేరనీ అన్నారు. ఈ నేపథ్యంలోనే ఓ హీరో సూపర్ స్టార్ డమ్ ను ఎలా కొలుస్తారు అన్న లెక్కలు తీశారు సినీపండిట్స్. అందులో హీరోల సినిమా థియేటర్ పర్ఫామెన్స్ , వారి చిత్రాల కలెక్షన్స్, వాటి రికార్డులు మొదటగా పరిగణిస్తారు. ఆ తీరున చూస్తే మన రెబల్ స్టార్ ప్రభాస్ కు ఉన్న థియేట్రికల్ పర్ఫామెన్స్ మరే స్టార్ హీరోకు లేదనే చెప్పాలి. ఇప్పటికీ ఫస్ట్ డే హయ్యెస్ట్ ఫుట్ ఫాల్స్ చూసిన సినిమాగా 'బాహుబలి- ద కంక్లూజన్' నిలచే ఉంది. 2017లో జనం ముందుకు వచ్చిన ఈ సినిమాను మొదటి రోజున ఒక కోటి ఐదు లక్షల మంది ప్రేక్షకులు వీక్షించారు. ఎనిమిదేళ్ళయినా 'బాహుబలి-2' నెలకొల్పిన ఈ రికార్డ్ చెక్కు చెదరకుండా ఉంది. దీని తరువాతి స్థానంలో మొదటి రోజు 71 లక్షల మంది ప్రేక్షకులతో 'పుష్ప-2' ఉంది. మూడో స్థానంలో 'కేజీఎఫ్ -2' 70 లక్షల మందితో నిలచింది. ఈ రెండు సినిమాలు సైతం 'బాహుబలి-2' కంటే దాదాపు 30 లక్షలకు పైగా వెనుకబడి ఉండడం గమనార్హం! సో. ఇప్పట్లో 'బాహుబలి-2'ను టచ్ చేసే సినిమా రాదనీ కొందరు భావిస్తున్నారు.


టాప్ టెన్ లో... ఐదు ప్రభాస్ మూవీస్...

మొదటి రోజున వీక్షించిన ప్రేక్షకుల లెక్కలను బట్టి టాప్ టెన్ లో నిలచిన చిత్రాల్లో 'ట్రిపుల్ ఆర్' నాలుగో స్థానంలోనూ, 'సలార్' ఐదో స్థానంలోనూ నిలిచాయి. తరువాతి స్థానాల్లో 'కల్కి, ఆదిపురుష్, సాహో, జవాన్, ప్రేమ్ రతన్ ధన్ పాయో' సినిమాలు ఉన్నాయి. ఈ తీరున చూస్తే ప్రభాస్ సినిమాలకు టాక్ తో పనిలేకుండా జనం పరుగులు తీశారని అర్థమవుతోంది. ఫస్ట్ డే ఫుట్ ఫాల్స్ - టాప్ టెన్ ఇండియన్ మూవీస్ లో ప్రభాస్ చిత్రాలే ఐదు ఉండడం గమనార్హం! దీనిని బట్టి ప్రభాస్ ను 'ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్' అని సంబోధించడంలో ఏలాంటి దోషమూ లేదని ట్రేడ్ పండిట్స్ అంటున్నారు.

ఇక మన భారతీయ సినిమాకు తొలి వెయ్యి కోట్లు చూపించిన చిత్రంగా 'బాహుబలి-2' నిలచింది. హయ్యెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ ఫిలిమ్స్ జాబితాలో ఇప్పుడు 'దంగల్' 1900 కోట్లకు పైగా పోగేసిందని చూపిస్తున్నారు.కానీ, 'దంగల్' ఇండియాలో 511 కోట్లు మాత్రమే సంపాదించింది. మిగిలిన 1400 కోట్లు విదేశాల నుంచే రాబట్టిందని చెప్పుకుంటున్నా బాలీవుడ్ జనాలే నమ్మడం లేదు. ఇక కేవలం ఇండియాలోనే 'బాహుబలి-2' చిత్రం 1400 కోట్లకు పైగా వసూలు చేసిందని ట్రేడ్ పండిట్స్ చెబుతున్నారు. భారతదేశంలోని కలెక్షన్స్ తోనే టాప్ టెన్ గా నిలచిన చిత్రాల్లో తొలి స్థానంలో 'బాహుబలి-2', ఐదో స్థానంలో 'కల్కి' ఉన్నాయి. ఆ తీరున చూసినా ఈ జాబితాలోనూ ప్రభాస్ దే పైచేయి. ఎటు చూసినా ఆధిక్యం ప్రదర్శిస్తున్న ప్రభాస్ కు అంతటి క్రేజ్ తీసుకు వచ్చిన 'బాహుబలి' సిరీస్ ఒకే మూవీగా 'బాహుబలి ది ఎపిక్' పేరుతో జనం ముందుకు వస్తోంది. మరి ఈ సినిమా ఫస్ట్ డే ఎన్ని ఫుట్ ఫాల్స్ చూస్తూందో చూడాలి.

Also Read: Pawan Kalyan: ఓటీటీలో నాలుగో స్థానంలో ఓజీ...

Also Read: De De Pyaar De 2: ఓరి దేవుడో... రకుల్ వైబ్ మామూలుగా లేదుగా...

Updated Date - Oct 30 , 2025 | 04:46 PM