సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Prabhas- Anushka: అన్నావదిన మళ్లీ జంటగా కనిపించబోతున్నారోయ్.. పండగే

ABN, Publish Date - Aug 20 , 2025 | 07:07 PM

ఇండస్ట్రీలో కొన్ని పెయిర్స్ ఎప్పుడు బోర్ కొట్టవు. ఇంకా చెప్పాలంటే వారు రీల్ గా కాకుండా రియల్ గా కలిసి ఉండాలని అభిమానులు కోరుకుంటూ ఉంటారు.

Bahubali

Prabhas- Anushka: ఇండస్ట్రీలో కొన్ని పెయిర్స్ ఎప్పుడు బోర్ కొట్టవు. ఇంకా చెప్పాలంటే వారు రీల్ గా కాకుండా రియల్ గా కలిసి ఉండాలని అభిమానులు కోరుకుంటూ ఉంటారు. అలా ఎంతోమంది అభిమానులు ఈ జంట పెళ్లి చేసుకుంటే బావుండు అనుకొనే హీరోహీరోయిన్ ప్రభాస్ - అనుష్క (Prabhas- Anushka).. బిల్లా సినిమాతో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అప్పటినుంచి ఈ జంటకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి. ఆ తరువాత బాహుబలి, బాహుబలి 2, మిర్చి.. ఈ సినిమాలతో వారిద్దరి మధ్య పరిచయం గాఢమైన స్నేహంగా మారింది. ఇంకోపక్క వీరి మధ్య బంధాన్ని ప్రేమ అనుకోని.. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటున్నారని పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి.


నిజం చెప్పాలంటే ప్రభాస్ పక్కన అనుష్క సెట్ అయ్యినట్లు ఇంకెవరు సెట్ అవ్వరు అంటే అతిశయోక్తి కాదు. వీరిద్దరి మధ్య బాండింగ్ చూస్తే ఇద్దరూ ప్రేమలో ఉన్నారేమో అని అనిపించక మానదు. అందుకే ఎప్పుడు ప్రభాస్ పెళ్లి గురించి మాట్లాడినా.. అనుష్కతోనే అని ఫ్యాన్స్ చెప్పుకొస్తారు. అంతేకాకుండా ప్రభాస్ ను అన్న అని, అనుష్కను వదినా అని ప్రేమగా పిలుస్తారు. కానీ, తమ మధ్యఎలాంటి ప్రేమ బంధం లేదని, తామిద్దరం మంచి స్నేహితులమని వారు చెప్పుకొస్తూనే ఉన్నారు. బాహుబలి 2 తరువాత ఈ జంట కలిసి నటించలేదు. ఎక్కడకు వెళ్లినా.. ప్రభాస్ - అనుష్క మళ్లీ కలిసి నటించాలని, కనీసం కలిసి కనిపించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక ఎట్టకేలకు అభిమానుల కోరిక నెరవేరే ఛాన్స్ వచ్చింది.


బాహుబలి రెండు పార్ట్స్ కలిపి బాహుబలి ది ఎపిక్ పేరుతో అక్టోబర్ 31 న రీరిలీజ్ అవుతున్న విషయం తెల్సిందే. రెండు పార్ట్స్ లో కొంతవరకు కట్ చేసి.. మరికొన్ని యాడ్ చేసి కొత్త సినిమాగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక రాజమౌళి సినిమా అంటే అది కొత్తదైనా.. పాతదైనా ప్రమోషన్స్ మాత్రం అందుకు తగ్గట్లుగానే ఉంటుంది. ఇక బహుబలి ఎపిక్ ప్రమోషన్స్ కూడా ఆ రేంజ్ లోనే ఉండబోతున్నాయని టాక్. ఈ ప్రమోషన్స్ కు బాహుబలి, దేవసేన రాబోతున్నారు. అంటే ప్రభాస్ - అనుష్క చాలాగ్యాప్ తరువాత ఒకే స్టేజిపై కనిపించబోతున్నారు. దీంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఎప్పుడెప్పుడు ఆ మూమెంట్ వస్తుందా అని ఎదురుచూస్తున్నారు.


ఇప్పటికే ప్రభాస్ , రానాలతో ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేసిన రాజమౌళి.. అనుష్కను కూడా రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. ఇక స్వీటీ ఘాటీ ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ లోనే ఉండడంతో రెండు కలిసి వస్తాయని జక్కన్న ప్లాన్ చేసినట్లు సమాచారం. ఏదిఏమైనా బాహుబలి ప్రమోషన్స్ కోసం మరోసారి ప్రభాస్ - అనుష్క జంటగా కనిపించడం ఫ్యాన్స్ ను సంతోషపరిచే విషయం కావడంతో ఎన్నాళ్లకు అన్నావదిన దర్శనం అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.

Naga Vamsi: నన్ను మిస్ అవుతున్నారా.. దానికి చాలా టైమ్ ఉంది

Nara Rohith: ట్రైలర్ నచ్చకపోతే సినిమా చూడరు.. వార్ 2 ఇప్పటివరకు చూడలేదు

Updated Date - Aug 20 , 2025 | 07:18 PM