Vasanth: ఆ కంపెనీలో.. డబ్ చేస్తే పాన్ ఇండియా హిట్టే
ABN, Publish Date - Sep 19 , 2025 | 08:05 AM
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయం సాధించింది 'మిరాయ్'. తేజ సజ్జ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శతత్వంలో టిజి విశ్వా ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా తెలుగు తోపాటు హిందీ, తమిళ, మలయాళం, కన్నడ, మరాఠీ, బెంగాలీ మరియు చైనా, జపాన్ లాంటి దేశాల్లో కూడా విజయవంతంగా ఆడుతోంది.
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయం సాధించింది 'మిరాయ్' (mirai). తేజ సజ్జ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శతత్వంలో టిజి విశ్వా ప్రసాద్ (TG Vishwa prasad) నిర్మించిన ఈ సినిమా తెలుగు తోపాటు హిందీ, తమిళ, మలయాళం, కన్నడ, మరాఠీ, బెంగాలీ మరియు చైనా, జపాన్ లాంటి దేశాల్లో కూడా విజయవంతంగా ఆడుతోంది. ఈ సినిమా అనువాద కార్యక్రమాలన్నీ పోస్ట్ ప్రో మీడియా వర్క్స్. (Post pro media works) కంపెనీ నిర్వహించింది. ప్రస్తుతం ఈ సంస్థ సక్సెస్ ఫుల్ నడుస్తూ కొన్ని నిర్మాణ సంస్థలకు సెంటిమెంటుగా మారింది.
గతంలో కార్తికేయ 2, మహారాజా, మిరాయ్..ఇదే కంపెనీలో డబ్బింగ్ పనులు నిర్వహించారు. ఈ కంపెనీలో చేసిన ప్రతి సినిమా డబల్ ధమకానే అని చెప్పుకుంటున్నారు. టాలివుడ్ లో మొట్టమొదటిసారిగా డబ్బింగ్ ఏజెన్సీ కల్చర్ ను తెచ్చి డబ్ కాస్టింగ్ కూడా పనులు కూడా వారే చూసుకుంటున్నారు. ఈ విధానాన్ని 'మిరాయ్' సినిమాతో మొదలు పెట్టి భారీ విజయాన్ని అందుకున్నారు.. హైదరాబాద్ లో ప్రముఖ రికార్డింగ్, డబ్బింగ్ స్టూడియో అయిన వారాహి స్టూడియోస్ ఈ సంస్థకు చెందినదే. మిరాయ్ సక్సెస్ సందర్భంగా పోస్ట్ ప్రో మీడియా వర్క్స్, వారాహి స్టూడియోస్ హెడ్ మహారాజ వసంత్ ఆనందం వ్యక్తం చేశారు.