సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Poonam Kaur: మగాడిని డబ్బుతో కొనగలవు.. సమంత పెళ్లిపై పూనమ్ ఫైర్

ABN, Publish Date - Dec 01 , 2025 | 06:32 PM

వివాదం ఎక్కడ ఉంటే అక్కడ నేను ఉంటా.. లేకపోతే వివాదాన్ని కావాలనే కొనితెచ్చుకుంటా అనుకొనే సెలబ్రిటీల్లో పురుషుల్లో రామ్ గోపాల్ వర్మ అయితే.. మహిళల్లో పూనమ్ కౌర్ (Poonam Kaur) అని చెప్పొచ్చు.

Poonam Kaur

Poonam Kaur: వివాదం ఎక్కడ ఉంటే అక్కడ నేను ఉంటా.. లేకపోతే వివాదాన్ని కావాలనే కొనితెచ్చుకుంటా అనుకొనే సెలబ్రిటీల్లో పురుషుల్లో రామ్ గోపాల్ వర్మ అయితే.. మహిళల్లో పూనమ్ కౌర్ (Poonam Kaur) అని చెప్పొచ్చు. ఏ టాపిక్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ ఉంటే దాని గురించి పూనమ్ మాట్లాడుతూ వస్తుంది. ఇక త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ గురించి టాపిక్ అయితే అమ్మడు అదే పనిలో ఉంటుంది. తాజాగా పూనమ్ ఒక పోస్ట్ పెట్టింది. అది హీరోయిన్ సమంత (Samantha) పెళ్లి గురించే అని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు.

నేటి ఉదయం సమంత.. డైరెక్టర్ రాజ్ నిడిమోరు వివాహం ఈషా ఆశ్రమంలో చాలా సింపుల్ గా జరిగింది. వీరిద్దరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇక ఈ పెళ్లి గురించి, సమంత గురించి పూనమ్ మండిపడింది.' నీకు ఒక సొంతిల్లు సృష్టించుకోవడానికి.. మరొక ఇల్లును విచ్ఛినం చేయడం చాలా బాధాకరం. డబ్బులిచ్చి పీఆర్ ల చేత ప్రశంసలు అందుకుంటున్న ఒక చదువుకున్న.. సాధికారిత కలిగిన, అహంకారం కలిగిన మహిళ. డబ్బుతో నిరాశలో ఉన్న మగాళ్లను కొనగలవు' అంటూ చెప్పుకొచ్చింది.

ఇక పూనమ్ పోస్ట్ పై పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఒకరైతే ఫ్యామిలీ గురించి నువ్వు మాట్లాడితే.. మియా ఖలీఫా వర్జినిటీ గురించి మాట్లాడినట్లు ఉంది అని కామెంట్ చేయగా.. దానికి పూనమ్ త్రివిక్రమ్ పేరు తీసుకొచ్చింది. ' త్రివిక్రమ్ ని అడగండి.. నేను ఏదైనా చేయాలనే ఉద్దేశ్యంతో మాట్లాడితే నా ప్రాణాలను కూడా వదులుకుంటాను. అతను ఎందుకు దాక్కున్నాడు. అతన్ని వచ్చి మాట్లాడమని చెప్పండి. నేను ఎవరి నుండి కూడా ఏమీ తీసుకోలేదు.. ఏమీ ఆశించలేదు' అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

పూనమ్ అన్నదాంట్లో తప్పేమి లేదని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. రాజ్ నిడిమోరు.. సమంత రాకముందు వరకు అతని భార్ శ్యామాలీతో సంతోషంగా ఉన్నాడు. వీరిద్దరికీ ఇంకా విడాకులు వచ్చాయి అనేది తెలియదు. శ్యామాలీ భర్త కోసం ఎంతో ఎదురుచూస్తుంది. సమంతానే వచ్చి తన భర్తను తనకు దూరం చేసిందని, ఆమె వలనే తన కుటుంబం నాశనం అయ్యిందని ఇన్ డైరెక్ట్ గా చెప్పుకొస్తూనే ఉంది. నేడు కూడా తెగించినవాళ్ళే ఇలా చేస్తారు అంటూ పోస్ట్ పెట్టింది. ఒక కుటుంబాన్ని కూల్చి.. సమంత తన కుటుంబాన్ని ఏర్పరుచుకుంది అని ట్రోల్ చేస్తున్నారు.

Updated Date - Dec 01 , 2025 | 06:32 PM