Nani x Sujeeth: నానికి జతగా పూజా హెగ్డే! సుజిత్.. భలే ఫ్లాన్ చేశాడుగా
ABN, Publish Date - Oct 19 , 2025 | 11:31 PM
తెలుగు చిత్ర పరిశ్రమలో మరో కొత్త జోడి తెరమీదకు వచ్చింది. ప్రస్తుతం ఈ అంశం అటు టాలీవుడ్‌ను ఇటు సోషల్ మీడియాను ఓ రేంజ్‌లో షేక్ చేస్తుంది.
తెలుగు చిత్ర పరిశ్రమలో మరో కొత్త జోడి తెరమీదకు వచ్చింది. ప్రస్తుతం ఈ అంశం అటు టాలీవుడ్‌ను ఇటు సోషల్ మీడియాను ఓ రేంజ్‌లో షేక్ చేస్తుంది. ఇంతకు వివరాల్లోకి వస్తే.. ఇటీవల పవన్ కల్యాణ్‌కు ఓజీ (OG) వంటి బ్లాక్‌బస్టర్ హిట్ సినిమా అందించిన సుజిత్ (Sujeeth)తన తదుపరి ప్రాజెక్టును ఇటీవల దసరా రోజున అల్రేడీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. నాని (Nani ) హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని గతంలో శ్యామ్ సింగరాయ్, సైంథవ్ చిత్రాలను నిర్మించిన వెంకట్ బోయపల్లి నిర్మిస్తున్నాడు. పాన్ ఇండియా స్టార్, మలయాళ సూపర్ స్టార్ ఫృధ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ఈ సినిమాలో కీలక పాత్ర చేస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే.. ఈ దీపావళి పండుగ వెళ్లాక ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించనున్నారు. కాగా ఈ చిత్రంలో హీరోయిన్‌గా పూజా హెగ్డే (Pooja Hegde)ను సెలక్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. రీసెంట్ నేషనల్ క్రష్ రుక్మిణీ వసంత్ ( RukminiVasanth)తో సైతం చర్చలు జరిగినప్పటికీ మేకర్స్ పూజానే ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. నాని, పూజా హెగ్డే కలయికలో రానున్న తొలి సినిమా కావడంతో సినిమాపై క్రమంగా హైప్స్ పెరుగుతున్నాయి. వారిద్దరి మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంటుందనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇటీవలే దుల్కర్ సల్యాన్ తెలుగులో చేస్తున్న చిత్రంతో పూజా రీ ఎంట్రీ ఇస్తుండగా ఆ సినిమా షూటింగ్ ఇప్పుడు శరవేగంగా జరుగుతోంది. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బుట్టబొమ్మ ఇప్పటికైనా హిట్ బాట పట్టాలని అమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ఇదిలాఉంటే ఈ సినిమాను అందరు అనుకుంటున్నట్లుగా ఓజీ యూనివర్స్ లో కాకుండా స్టాండ్ అలోన్ చిత్రంగా రన్ రాజా తరహాలో రూపొందిస్తున్నట్లు డైరెక్టర్ సుజిత్ ఇప్పటికే ప్రకటించడం విశేషం. అయితే.. ఈ సినిమాకు ‘బ్లడీ రోమియో’ (Bloody Romeo) అనే టైటిల్ ఖరారు చేసినట్లు వినిపిస్తున్నప్ప టికీ ఇంకా ఎక్కడా ఎలాంటి అధికారికంగా ప్రకటన అయితే చేయలేదు. కాగా నాని ప్రస్తుతం ప్యారడైజ్ సినిమా బిజీలో ఉండగా 2026 ప్రధమార్థంలో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి ఇయర్ ఎండింగ్ నాటికి మూవీని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.