Rashmika Mandanna: మహేష్ బాబులో నచ్చేది అదే..
ABN , Publish Date - Nov 03 , 2025 | 06:16 PM
'ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నా. డైరెక్ట్ తమిళ సినిమా చేయడానికి కొంత సమయం పడుతుంది. చాలా వరకూ చర్చల దశలోనే ఉన్నాయి. త్వరలోనే కార్యరూపం దాల్చుతుందని భావిస్తున్నా' అని రష్మిక మందన్న అన్నారు.
'ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నా. డైరెక్ట్ తమిళ సినిమా చేయడానికి కొంత సమయం పడుతుంది. చాలా వరకూ చర్చల దశలోనే ఉన్నాయి. త్వరలోనే కార్యరూపం దాల్చుతుందని భావిస్తున్నా' అని రష్మిక మందన్న అన్నారు. ఆమె కథానాయికగా రూపొందిన చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్’ (The Girlfriend). రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran) దర్శకుడు. అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మించారు. దీక్షిత్‌శెట్టి కీలక పాత్ర పోషిస్తున్నారు. నవంబరు 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా రష్మిక ఎక్స్ వేదికగా అభిమానులతో ముచ్చటించారు. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు.

'నాకంటూ కొంతమంది బెస్టీస్ ఉన్నారు. వాళ్ళే నా గర్ల్ ఫ్రెండ్స్. పబ్లిక్‌లో వాళ్ల పేరు చెబితే నన్ను చంపేస్తారు' అని ఓ నెటిజెన్ అడిగిన ప్రశ్నకు జవాబు ఇచ్చారు. 'ది గర్ల్‌ఫ్రెండ్', 'థామా' ఈ రెండిటిలో ఏ సినిమా చేయటం మీకు అత్యంత కష్టంగా అనిపించిందన్న ప్రశ్నకు 'ది గర్ల్‌ఫ్రెండ్' సినిమా చేయడం చాలా కష్టమని ఆమె చెప్పారు.
మహేష్ బాబులో నచ్చిన విషయం ఏంటని అడగగా.. ఆయనకి రోజురోజుకి వయసు తగ్గుతోంది. అది నాకు బాగా ఇష్టం. అదెలా సాధ్యమో నాకు తెలుసుకోవాలని ఉంది.