Pooj Hegde: జిగేల్ రాణికి మళ్లీ చుక్కెదురు
ABN, Publish Date - Jul 09 , 2025 | 04:58 PM
జిగేల్ రాణి మరో ఛాన్స్ ను చేజార్చుకుంది. క్రేజీ ప్రాజెక్టులో దాదాపుగా అవకాశం కొట్టేసిన అమ్మడు.. లాస్ట్ మినిట్ లో డ్రాప్ కావాల్సి వచ్చింది. ఆ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులో ఊహించని విధంగా మరో చిన్నది వచ్చి చేరడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది.
పూజాహెగ్డే (Pooja Hegde) తో బ్యాడ్ టైమ్ బంతాడేసుకుంటోంది. మొన్నటి వరకు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సిల్వర్ స్క్రీన్ పై రచ్చ చేసిన బ్యూటీ... ఇప్పుడు కొత్తగా అవకాశాలు రావడం లేదు. రజనీకాంత్ 'కూలీ'లో స్పెషల్ సాంగ్ చేస్తున్న పూజా హెగ్డే, విజయ్ మూవీ 'జన నాయగన్' లోనూ, లారెన్స్ 'కాంచన -4'లో పూజా హెగ్డే నటిస్తోంది. బాలీవుడ్ లో మెరుపులు మెరిపిస్తున్నా... కోలీవుడ్ లో మాత్రం ఆమె అవకాశాలను వేరొకరు చేజిక్కించుకుంటున్నారు. తెలుగులో పూజా హెగ్డే ఛాన్స్ లను శ్రీలీల (Sreeleela) కొట్టేస్తే... మరో చోట 'ప్రేమలు' బ్యూటీ మమిత చేజిక్కించుకోవడం సెన్సేషన్ గా మారింది. తాజాగా స్టార్ హీరో మూవీ నుంచి పూజాను తప్పించి మరో బ్యూటీని తీసుకోవడం వైరల్ గా మారింది.
'కుబేర' (Kuberaa) విడుదల తర్వాత హీరో ధనుష్ (Dhanush)వరుస ప్రాజెక్టులను లైన్లో పెడుతున్నాడు. అక్టోబర్‌లో ‘ఇడ్లీ కడై’ (Idli Kadai) రిలీజ్‌కు సిద్ధం అవుతుండగా, మరో భారీ పీరియడ్ డ్రామాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరన్న గుసగుసలు మొన్నటి వరకు ఫ్యాన్స్‌లో క్యూరియాసిటీని పెంచాయి. మొదట పూజా హెగ్డే పేరు బలంగా వినిపించి, అందరూ ఫైనల్ అనుకున్నారు. కానీ, ఇప్పుడు ఊహించని ట్విస్ట్‌తో మరో బ్యూటీ ఎంట్రీ ఇచ్చింది. ఆ ముద్దుగుమ్మనే మమితా బైజు (Mamitha Baiju). ఈ ప్రాజెక్ట్ తో పాటు మరో నాలుగైదు సినిమాలతో బిజీగా మారిందీ బ్యూటీ.
‘ప్రేమలు’ సినిమాతో సౌత్ ఇండియాను అట్రాక్ట్ చేసిన మమితా, ఇప్పుడు ఈ భారీ అవకాశంతో మరో మెట్టు ఎక్కబోతోంది. ధనుష్‌తో జోడీ కడుతూ తన పాపులారిటీని మరింత పెంచుకోబోతోంది. ఈ వారంలో సినిమా పూజా కార్యక్రమంతో ఘనంగా షురూ కాబోతోంది. ఈ ఏడాది చివర్లో షూటింగ్ పూర్తి చేసి, 2026 ప్రారంభంలో రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట.
ఈ చిత్రాన్ని ‘రాయన్’ డైరెక్టర్ విఘ్నేష్ రాజా (Vignesh Raja) తెరకెక్కిస్తున్నాడు. అభిమానులు మమితా - ధనుష్ జోడీని తెరపై చూసేందుకు ఎగ్జైటెడ్‌గా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని అప్డేట్స్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మమితా ఈ సినిమాతో తన క్రేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్తుందని అంచనా. ఇక జీవీ ప్రకాష్ సంగీతం, ధనుష్ నటన, విఘ్నేష్ రాజా విజన్‌తో రాబోతున్న ఈ పీరియడ్ డ్రామా ఎలా ఉంటుందనేది చూడాలి.