సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Nidhhi Agerwal: నిధీ అగర్వాల్‌ ఫిర్యాదు చేస్తే మరో కేసు ఫైల్‌ చేస్తామంటున్న పోలీసులు

ABN, Publish Date - Dec 19 , 2025 | 12:05 PM

‘ది రాజాసాబ్‌’ ( The Raja saab) సాంగ్‌ లాంచ్‌ ఈవెంట్‌ గురువారం కూకట్‌పల్లి, లూలూ మాల్‌లో అభిమానులు సమక్షంలో జరిగిన సంగతి తెలిసిందే! ఈవెంట్‌ పూర్తయ్యాక కారు ఎక్కడానికి వెళ్లున్న తరుణంలో నిధి అగర్వాల్‌కు (Nidhhi agarwal) చేదు అనుభవం ఎదరైంది.

‘ది రాజాసాబ్‌’ ( The Raja saab) సాంగ్‌ లాంచ్‌ ఈవెంట్‌ గురువారం కూకట్‌పల్లి, లూలూ మాల్‌లో అభిమానులు సమక్షంలో జరిగిన సంగతి తెలిసిందే! ఈవెంట్‌ పూర్తయ్యాక కారు ఎక్కడానికి వెళ్లున్న తరుణంలో నిధి అగర్వాల్‌కు (Nidhhi agarwal) చేదు అనుభవం ఎదరైంది. ఫ్యాన్స్‌, ఆకతాయిలు అత్యుత్సాహంప్రదర్శించారు. ఒక్కసారిగా ఫ్యాన్‌ ఆమె చుట్టుముట్టేయగా ఎటూ వెళ్లలేని పరిస్ధితి. బాడీగార్డులు ఎంత హెచ్చరించినా ఫ్యాన్స్‌ మాత్రం వెనక్కి తగ్గలేదు. అసభ్యంగా ఆమెను తాకారు. సెల్ఫీల కోసం ఎగబడ్డారు. చివరకు అందరినీ నెట్టి బాడీగార్డులు ఆమెను అతి కష్టం మీద కారు ఎక్కించారు. దీంతో ఆమె ఊపిరి పీల్చుకున్న ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సోషల్‌ మీడియా వేదికగా ఈవెంట్‌ నిర్వాహకులపై మండిపడ్డారు. కనీస ఏర్పాట్లు చేయలేదంటూ మండిపడుతూ ఎక్స్‌లో ఓ పోస్ట్‌ పెట్టి కాసేపటికి డిలీట్‌ చేశారు. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియోలు పోలీసుల దృష్టికి వెళ్లడంతో శ్రేయాస్‌ మీడియా, లూలూ మాల్‌ యాజమాన్యంపై కూకట్‌పల్లి పోలీసులు సుమోటోగా (suo moto case) కేసు నమోదు చేశారు. 'ది రాజాసాబ్‌' సాంగ్‌ లాంచ్‌ ఈవెంట్‌కు ఎలాంటి అనుమతి తీసుకోలేదని ఎస్‌హెచ్‌వో రాజశేఖర్‌ రెడ్డి తెలిపారు. నిధి అగర్వాల్‌ ఫిర్యాదు చేస్తే మరో కేస్‌ నమోదు చేసి పోకిరీలను గుర్తిస్తామని పోలీసులు తెలిపారు. 

నెటిజన్ల తీవ్ర ఆగ్రహం

ఫ్యాన్స్‌ ఇలా చేయడం కరెక్ట్‌ కాదంటూ నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈవెంట్‌ ఆర్గనైజర్స్‌ ఇలాంటి కార్యక్రమాలను పకడ్భందీగా ప్లాన్‌ చేయాలన్నారు. కనీస సౌకర్యాలు, పోలీస్‌ బందోబస్తు లేకపోవడం వల్లే ఇలా జరిగిందని మండిపడుతున్నారు. స్టార్స్‌ హాజరయ్యే ఈవెంట్‌లకు ముందుగానే సెక్యూరిటీ, బౌన్సర్లను అరేంజ్‌ చేసుకోవాలని ఇకపై ఇలా జరగకుండా  ప్లాన్‌ చేయాలని నెటిజన్లు సూచిస్తున్నారు.  

Updated Date - Dec 19 , 2025 | 12:10 PM