సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Peddi: 'చికిరి' ప్రోమో అదిరింది.. ఇక ఇంట‌ర్నెట్ షేకే! ఎక్క‌డ చూసినా.. చ‌ర‌ణ్ స్టెప్పులే క‌నిపిస్తాయి

ABN, Publish Date - Nov 05 , 2025 | 11:58 AM

రామ్ చ‌ర‌ణ్ (Ram Charan) బుచ్చిబాబు సానా కాంబోలో వ‌స్తున్న పెద్ది (PEDDI) సినిమాపై ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ అంచ‌నాలు ఉన్న విష‌యం తెలిసిందే.

Ram Charan

రామ్ చ‌ర‌ణ్ (Ram Charan) బుచ్చిబాబు సానా కాంబోలో వ‌స్తున్న పెద్ది (PEDDI) సినిమాపై ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ అంచ‌నాలు ఉన్న విష‌యం తెలిసిందే. జాన్వీ క‌థానాయిక కాగా ఆస్కార్ విన్న‌ర్ రెహామాన్ సంగీతం అందిస్తున్నాడు. అయితే.. ఈ సినిమా నుంచి అప్డేట్ ఎప్పుడు వ‌స్తుందా అని మెగా అభిమానులు వెయ్యి క‌ళ్ల‌తో ఎదురు చూస్తున్నారు. ఇప్ప‌టికే వ‌చ్చిన ఫ‌స్ట్ షాట్ వీడియో ప్ర‌పంచ వ్యాప్తంగా తెగ వైర‌ల్ అయింది.

ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర వేగంగా జ‌రుగుతుండ‌గా ఇటీవ‌లే శ్రీలంక‌లో ఓ పాట సైతం చిత్రీక‌రణ పూర్తి చేసుకుని టీం తిరిగి వ‌చ్చింది. వ‌చ్చే మార్చిలో ఈ మూవీ ప్రేక్ష‌కుల‌కు ఎదుట‌కు రానుంది. ఈ నేప‌థ్యంలో మేక‌ర్స్ ఈ చిత్రం నుంచి ఓక్కొక్క‌టిగా అప్డేట్ ఇచ్చేందుకు సిద్ధ‌మ‌య్యారు. తాజాగా ఈ సినిమా నుంచి పాట రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన డైరెక్ట‌ర్ బుచ్చి బాబు సానా పాట‌కు సంబంధించి బుధ‌వారం చిన్న గ్లిమ్స్ రిలీజ్ చేసి న‌వంబ‌ర్ 7, శుక్ర‌వారం రోజున పూర్తి పాటను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

ఇందుకోసం బుచ్చిబాబు ఏకంగా ఈ సినిమా సంగీత ద‌ర్శ‌కుడు రెహామాన్ (AR Rahman)నే రంగంలోకి దింపాడు. ఆయ‌న‌తో త‌న ఫ‌స్ట్ ఇంట‌రాక్ష‌న్ గురించి వివ‌రించి చివ‌ర‌కు ఈ సినిమా సాంగ్ సిట్యూవేష‌న్ చెప్పి ఓ ట్యూన్ అడ‌గ‌డం అయ‌న వెంట‌నే చికిరి చికిరి (Chikiri Chikiri) అంటూ ఓ ట్యూన్ ఇవ్వ‌డం అంతా చ‌క‌చ‌కా జ‌రిగిపోయిన‌ట్లు చూపించారు. చివ‌ర్లో పాట ట్యూన్‌కు త‌గ్గ‌ట్టు రామ్‌చ‌ర‌ణ్ వేసిన స్టెప్స్ ను సైతం చూపించి ఒక్క సారిగా పాట‌పై హైప్ పెంచేశారు.

ఈ వీడియో బ‌య‌ట‌కు వ‌చ్చిన క్ష‌ణాల్లోనే రామ్ చ‌ర‌ణ్ హుక్ స్టెప్ సోష‌ల్‌ మీడియాను క‌మ్మేపింది. రామ్ చ‌ర‌ణ్ , మెగా అభిమానులే కాక చాలామంది నెటిజ‌న్లు సైతం ఈ వీడియోకు, ఆ స్టెప్పుల‌కు ఫిదా అవుతున్నారు. రానున్న‌ నెల‌రోజులు ఈ పాట ఇంట‌ర్నెట్‌ను షేక్ చేస్తుంద‌న‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు. ఎక్క‌డ‌ చూసినా రామ్ చ‌ర‌ణ్ స్టెప్పులే ద‌ర్శ‌ణ‌మివ‌డం గ్యారంటీ. ఇంకెందుకు ఆల‌స్యం ఇప్పుడే మీరు ఈ వీడియోపై లుక్కేయండి.

Updated Date - Nov 05 , 2025 | 12:10 PM