సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Peddi Song: ‘చికిరి’ పాట కోసం రెహమాన్‌ ఎవర్ని దింపారంటే..

ABN, Publish Date - Nov 04 , 2025 | 12:43 PM

రామ్‌ చరణ్‌ ‘పెద్ది’ హీరోగా బుజ్జిబాబు సాన దర్శకత్వం వహిస్తున్న ‘పెద్ది’ సినిమా ప్రమోషన్స్‌ షురూ అయ్యాయి. సినిమాకు సంబంధించి ఏదో ఒక అప్‌డేట్‌ ఇస్తూ సినిమాపై అంచనాలు పెంచుతున్నారు.


రామ్‌ చరణ్‌ హీరోగా (Ram Charan) బుజ్జిబాబు సాన దర్శకత్వం (Buchibabu Sana) వహిస్తున్న ‘పెద్ది’ (peddi)సినిమా ప్రమోషన్స్‌ షురూ అయ్యాయి. సినిమాకు సంబంధించి ఏదో ఒక అప్‌డేట్‌ ఇస్తూ సినిమాపై అంచనాలు పెంచుతున్నారు. మేకర్స్‌. తాజాగా కథానాయికగా నటిస్తున్న జాన్వీ కపూర్‌ క్యారెక్టర్‌ రివీల్‌ చేస్తూ పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. అలాగే ఫస్ట్‌ సింగిల్‌ టైటిల్‌ కూడా తెలిపారు.  ఈ పాట ‘చికిరి’ (Chikiri Song) అనే లైన్‌తో ఉంటుందని తెలిసింది. ఈ విషయాన్ని స్వయంగా ఎ.ఆర్‌.రెహమాన్‌ వెల్లడించారు. దర్శకుడు, సింగర్‌ మోహిత్‌ చౌహాన్‌తో కలిసి కీ బోర్డ్‌ ముందుకు కూర్చున్న ఫొటోను రామ్‌చరణ్‌ షేర్‌ చేసి ఏం  వండుతున్నారు గయ్స్‌’ అని ట్వీట్‌ చేశారు. దానికి ‘చికిరి చికిరి.. చరణ్‌గారు’ అంటూ సంగీత దర్శకుడు ఏ.ఆర్‌.రెహమాన్‌ రిప్లై ఇచ్చారు. దర్శకుడు కూడా అదే సమాధానమిచ్చారు. ప్రస్తుతం ఎక్స్‌లో వీరి సంభాషణ నెట్టింట వైరల్‌ మారింది. పాట కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నట్లు అభిమానులు పోస్ట్‌లు పెడుతున్నారు.



అయితే ఈ పాట ప్రమోషనల్‌ వీడియోలో రెహమాన్‌ కూడా కనిపించబోతున్నారు. చికిరి పాటకి సింగర్‌ గా మోహిత్‌ చౌహాన్‌ను (Singer mohit chouhan) ఎంపిక చేశారాయన. హిందీలో ఆయన ఎన్నో హిట్‌ చిత్రాలకు పాటలు పాడారు. అక్కడ ఆయన ఎంతో పాపులర్‌. ‘రాక్‌ స్టార్‌’ సినిమాలో మొత్తం 15 పాట ఉంటే అందులో తొమ్మిది పాటలిన మోహిత్‌ ఛౌహాన్‌తోనే పాడించారు రెహమాన్‌.  దాంతో ఆయన పేరు పాపురల్‌ అయింది. మోహిత్‌ తెలుగు సంగీత దర్శకులతో ఎక్కువ పని చేయలేదు కానీ తమిళ సినిమా పాటల్ని తెలుగులో పాడారు. ఆయన వాయిస్‌ కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. దర్శకుడు నాగ్‌ అశ్విన్‌కు ఆయనపై ప్రత్యేక అభిమానంతో ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాలో ‘ఇదేరా’ అంటూ సాగే పాటను పాడించారు. తర్వాత డైరెక్ట్‌ తెలుగు సినిమా పాడిన సందర్భం లేదు. ఇప్పుడు ‘పెద్ది’ సినిమాతో తెలుగులో మళ్లీ పాడుతున్నారు. అయితే పెక్యులర్‌ వాయిస్‌ చికిరి పాటకు కొత్తదనం తీసుకొస్తుందని టీమ్‌ బలంగా నమ్ముతోంది. 

Updated Date - Nov 04 , 2025 | 12:43 PM