‘కాంతార చాప్టర్ 1’ చిత్రానికి ఇబ్బందులు కలిగించవద్దు..
ABN, Publish Date - Sep 29 , 2025 | 10:59 PM
'కన్నడ సినిమా ‘కాంతార చాప్టర్ 1’ టికెట్ ధరలు పెంపునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవకాశం కల్పించనుంది. ఈ సినిమా టికెట్ ధరలు పెంపుపై చర్చ జరిగినట్టు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు.
'కన్నడ సినిమా ‘కాంతార చాప్టర్ 1’ (Kantara chaper 1) టికెట్ ధరలు పెంపునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవకాశం కల్పించనుంది. ఈ సినిమా టికెట్ ధరలు పెంపుపై చర్చ జరిగినట్టు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawn kalyan) తెలిపారు. ఆయన హీరోగా నటించిన ఓజీ చిత్రానికి కర్ణాటకలో ఎదురవుతున్న ఇబ్బందులను తెలుగు సినీ వర్గాలు పవన్ దృష్టికి తీసుకెళ్లాయి. సినిమా పోస్టర్లు, బ్యానర్లు తొలగిస్తున్నారని ఆయనకు తెలపగా పవన్ స్పందించారు. ‘కర్ణాటకలో పరిణామాలను దృష్టిలో ఉంచుకొని కన్నడ చిత్రాలకు ఇక్కడ ప్రోత్సాహించడం ఆపొద్దు. మంచి మనసుతో, జాతీయ భావనతో ఆలోచనలు చేయాలి. కన్నడ కంఠీరవ డా.రాజ్ కుమార్ నుంచి కిచ్చా సుదీప్, ఉపేంద్ర, శివరాజ్ కుమార్, రిషబ్ శెట్టి వరకూ అందరినీ తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అంతా సోదరభావంతో ఉన్నాం. కళ అనేది మనసుల్ని హత్తుకొని మనుషుల్ని కలిపేది... అంతేగానీ భాష పేరుతో విడదీసి మనుషుల్ని దూరం చేసేది కాదు. సినిమా అనేది భిన్న కళల సమాహారం. అందుకే పర భాషా చిత్రం అనే పేరుతో మన రాష్ట్రంలో వేరుగా చూడాల్సిన అవసరం లేదని తెలిపారు.
మంచి మనసుతో... జాతీయ భావనతో ఆలోచన చేయాలి..
కర్ణాటకలో పరిణామాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లగా పవన్ కల్యాణ్ గారు స్పందిస్తూ ుకళ అనేది మనసుల్ని కలపాలి. విడదీయకూడదు అనేది వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుందాం. మంచి మనసుతో, జాతీయ భావనతో ఆలోచనలు చేయాలి. మన సినిమాకు వ్యాపారాత్మకంగా ఎదురవుతున్న ఇబ్బందుల్ని రెండు భాషల ఫిల్మ్ ఛాంబర్స్ కూర్చుని మాట్లాడుకోవాలి. అప్పుడు ప్రభుత్వపరంగా మనమూ మాట్లాడవచ్చు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతాను. కర్ణాటకలో ఎదురైన పరిణామాలను దృష్టిలో పెట్టుకొని కాంతారా ఛాప్టర్ 1 కి ఆటంకాలు కల్పించవద్దు’ అన్నారు. రిషబ్ శెట్టి నటించి దర్శకత్వం వహించిన చిత్రమిది. అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.