OG Movie: ఓజీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఇక ఫ్యాన్స్‌ను ఆపడం కష్టమే
ABN, Publish Date - May 25 , 2025 | 06:59 PM
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రెండేండ్ల విరామం తర్వాత వరుస చిత్రాలతో అలరించేందుకు సిద్ధమయ్యాడు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) రెండేండ్ల విరామం తర్వాత వరుస చిత్రాలతో అలరించేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పటికే హరిహరవీర మల్లు (Harihara Veeramallu) సినిమా షూటింగ్ పూర్తవగా మరో 20 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదిలాఉండగానే రీసెంట్‌గా సుజిత్ (Sujith) సినిమా ఓజీ (OG) షూటింగ్‌కు కూడా సమయం కేటాయించిన పవన్ (Pawan Kalyan) ఇప్పుడా సినిమా పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం అనంతరం హరీశ్ శంకర్ (Harish Kalyan) దర్శకత్వంలో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagath Singh) మూవీని సైతం ముగించనున్నాడు.
అయితే తాజాగా.. ఓజీ (OG) మూవీ గురించి మేకర్స్ ఓ ఆప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాను ముందు నుంచి అనుకున్న ప్రకారమే సెప్టెంబర్25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్లు ప్రకటించారు. ఈ వార్త ఇప్పుడు పవన్ (Pawan Kalyan) ఫ్యాన్స్‌ను ఫుల్ జోష్ ఇవ్వగా వారి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.
ఇప్పటికే హరిహరవీరమల్లు (Harihara Veeramallu) సినిమా రిలీజ్ నేపథ్యంలో సోషల్ మీడియాలో తెగ హాడావుడి చేస్తున్న వీరికి ఇప్పుడు ఓజీ (OG) రిలీజ్ డేట్ కూడా వచ్చేయడంతో పవన్ ఫ్యాన్స్‌ను ఇ్పపట్లో ఆపడం కష్టమే అనేలా పరిస్థితి ఉంది. హరిహర వీరమల్లు(Harihara Veeramallu)లో నిధి ఆగర్వాల్ (Nidhhi Agerwal), ఓజీలో ప్రియాంకా మోహన్ (Priyanka Mohan), ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagath Singh)లో శ్రీలీల (Sreeleela) కథానాయికలుగా నటిస్తున్నారు.
ఇదిలాఉంటే.. బాలకృష్ణ, బోయపాటి కాంబోల వస్తున్న అఖండ2 విడుదల తేదీ సెప్టెంబర్25 అని సినిమా షూటింగ్ మొదటి రోజే ప్రకటించి ఉండడం గమనార్హం. దీంతో ఇప్పుడు ఈ రెండు చిత్రాల రిలీజ్‌లు విషయంలో ఎవరు వెనుకకు తగ్గుతారు, లేక ఒకే రోజు రిలీజ్ చేస్తారా అనేది మరి కొద్ది రోజులు వేచి చూస్తే గానీ తెలియదు.