Pawan Kalyan: అవి బావిలో కప్పలు.. ట్రోలర్స్ కు పవన్ గట్టి కౌంటర్

ABN , Publish Date - Jul 23 , 2025 | 08:16 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) .. సినిమాలు చేసుకుంటూ ఉండే సమయంలో ఎవరు ఆయనను వేలెత్తి చూపే దైర్యం చేయలేదు.

Pawan Klyan

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) .. సినిమాలు చేసుకుంటూ ఉండే సమయంలో ఎవరు ఆయనను వేలెత్తి చూపే దైర్యం చేయలేదు. ఎప్పుడైతే పవన్ రాజకీయాల్లోకి అడుగుపెట్టాడో ప్రతి ఒక్కరు ఆయనను విమర్శించేవారు. ఏ పని చేసినా అందులో నెగిటివిటీని తీసి సోషల్ మీడియాలో విమర్శిస్తూ ఉంటారు. రాజకీయ నాయకులకు విమర్శలు కొత్తకాదు. సమయం చిక్కినప్పుడల్లా పవన్ ట్రోలర్స్ కు కౌంటర్లు ఇస్తూనే ఉంటాడు. తాజాగా హరిహర వీరమల్లు( HariHara Veeramallu)లో గట్టి కౌంటర్ ఇచ్చాడు.


పవన్ ఏ ఊర్లో మీటింగ్ పెడితే అక్కడ.. ఆ ఊర్లో నేను పుట్టాను. ఈ ఊర్లో నేను పెరిగాను .ఇక్కడ నేను చదువుకున్నాను. ఈ వీధుల్లో తిరిగాను అని చెప్పుకొచ్చేవాడు. దీంతో ట్రోలర్స్... వాటన్నింటిని ఒక వీడియోగా కన్వర్ట్ చేసి.. ఎన్ని ఊర్లలో పుడతావ్ నువ్వు.. అంటూ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అయితే ఈ వీడియోను కొంతమంది రాజకీయ నేతలు కూడా సమర్ధించారు. మాట మీద నిలబడని మనిషి అని, నోటికి ఏది వస్తే అది మాట్లాడతాడని చెప్పుకొచ్చారు.


తాజాగా హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ ఈ విమర్శలపై స్పందించాడు. నేను పవనం లాంటివాడిని.. ఎక్కడైనా ఉంటాను. వాళ్లు బావిలో కప్పలు అలాగే మాట్లాడతారు అంటూ చెప్పుకొచ్చి షాక్ ఇచ్చాడు. ' పవన్ కళ్యాణ్ ఏ ఊరు వెళ్లినా.. అక్కడే పెరిగినంటాడు. కనిగిరి వెళ్తే కనిగిరిలో పెరిగినంటాడు. వైజాగ్ వస్తే వైజాగ్ లో పెరిగినంటాడు. కానీ, నేనేం చేస్తాను. నా పేరు పవనం.. నేను తిరుగుతా ఉంటాను. మనం పవనాలు అయితే అవి కూపస్థమండూకాలు ఇలాగే మాట్లాడతారు. బావిలో కప్పలు.. అవి గిరిగీసుకొని కూర్చుంటాయి. పవనం తాలూకు శక్తి వాటికి అర్ధం కావు. పవనం సర్వాంతర్యామి' అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Rana Daggubati: రానాకు మళ్లీ ఈడీ నోటీసులు

Tabu: ఈ వయస్సులో కూడా సీనియర్ బ్యూటీ సెగలు పుట్టిస్తుందే

Updated Date - Jul 23 , 2025 | 08:54 PM