సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

నా మనసుకు చేరువైన పాత్ర చేయలేదు- పవన్‌ కల్యాణ్‌

ABN, Publish Date - Jun 23 , 2025 | 04:35 AM

ఇప్పటి వరకు నేను సినిమాల్లో పొషించిన పాత్రల్లో పూర్తి స్థాయిలో నా మనసుకు చేరువైంది ఏదీ లేదు. ప్రతి పాత్రలో కొన్ని లక్షణాలు మాత్రమే నచ్చాయి. నిజ జీవితంలో...

'ఇప్పటి వరకు నేను సినిమాల్లో పొషించిన పాత్రల్లో పూర్తి స్థాయిలో నా మనసుకు చేరువైంది ఏదీ లేదు. ప్రతి పాత్రలో కొన్ని లక్షణాలు మాత్రమే నచ్చాయి. నిజ జీవితంలో ఎలా ఉంటానో సినిమాల్లోనూ అలాగే కనిపించాలని ఉంది. కానీ అది సాధ్యపడక పోవచ్చు’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు హీరో, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌. ఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను రాజకీయాల్లోకి రావడం వెనుక ఉన్న నేపథ్యాన్ని వివరించారు. ‘సినిమాల్లోకి అడుగుపెట్టాలని ఎప్పుడూ అనుకోలేదు. మాదో మధ్యతరగతి కుటుంబం. నాన్న ప్రభుత్వ ఉద్యోగి. కమ్యూనిస్టు భావాలను పాటించేవారు. ఆయన ద్వారా మాకు రాజకీయాలపై అవగాహన వచ్చింది. సమాజంపై ఆలోచనతోనే రాజకీయాల్లోకి ప్రవేశించాను. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను తెలియజేస్తూ బాలీవుడ్‌లో మంచి సినిమాలు వచ్చేవి. ‘దంగల్‌’ లాంటి సినిమాలు ఇప్పుడు రావడం లేదు’ అని తెలిపారు. కాగా, పవన్‌ కల్యాణ్‌ నటించిన ‘హరి హర వీరమల్లు’ జూలై 24న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరోవైపు పవన్‌ కల్యాణ్‌.. హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’, సుజీత్‌ డైరెక్షన్‌లో ‘ఓజీ’ సినిమాలు చేస్తున్నారు.

Updated Date - Jun 23 , 2025 | 04:38 AM