OG Wraps Up Shoot: ఓజీ షూటింగ్ పూర్తి
ABN, Publish Date - Jul 12 , 2025 | 01:56 AM
పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఓజీ సినిమా షూటింగ్ పూర్తయింది.
పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘ఓజీ’ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ మేరకు చిత్ర యూనిట్ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. దసరా పండుగ సందర్భంగా సెప్టెంబరు 25న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోందంటూ రిలీజ్ డేట్ పోస్టర్‌ని విడుదల చేసింది. వర్షంలో తడుస్తూ కారు దిగి గన్‌తో ఫైర్ చేస్తున్న పవన్ కల్యాణ్ పోస్టర్ అదిరిపోయింది. కాగా, ఈ సినిమాను సుజీత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బేనర్‌పై దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక అరుల్ మోహన్, ప్రకాశ్ రాజ్, శ్రియ రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.