OG Trailer: బాంబే వస్తున్నా.. తలలు జాగ్రత్త.. ఓజీ ట్రైలర్ అదిరింది.. బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయం
ABN, Publish Date - Sep 21 , 2025 | 11:14 PM
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫ్యాన్స్ ఎన్నాళ్ళగానో ఎదురుచూస్తున్న సినిమా ఓజీ (OG) రిలీజ్ కు రెడీ అవుతోంది.
OG Trailer: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫ్యాన్స్ ఎన్నాళ్ళగానో ఎదురుచూస్తున్న సినిమా ఓజీ (OG) రిలీజ్ కు రెడీ అవుతోంది. కుర్ర డైరెక్టర్ సుజీత్(Sujeeth) దర్శకత్వం వహించిన ఈ సినిమాను డీవీవీ దానయ్య ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తుండగా.. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా మంచి హైప్ ను క్రియేట్ చేసింది.
ఎన్నో వాయిదాల తరువాత ఎట్టకేలకు సెప్టెంబర్ 25 న రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండగా ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ నేడు ఎల్ బి స్టేడియంలో ఓజీ కన్సర్ట్ పేరుతో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించాలని చూశారు. కానీ, వరుణుడు అంతరాయం కలిగించాడు. అయినా కూడా పవన్ ఎక్కడా తగ్గేదేలే అంటూ వర్షంలోనే తన స్పీచ్ ను కొనసాగించాడు. అంతేనా తన కోసం ఇంతదూరం వచ్చిన ఫ్యాన్స్ ను నిరాశపర్చకుండా ట్రైలర్ ఇంకా ఫినిష్ కాకపోయినా.. ఫ్యాన్స్ కోసం ఈవెంట్ లోనే ట్రైలర్ రిలీజ్ చేయించాడు.