సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

OG Ticket Hikes: ఓజీ టికెట్ రూ.1000.. ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్‌

ABN, Publish Date - Sep 17 , 2025 | 08:53 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్బి యాక్షన్-క్రైమ్ చిత్రం OG ఈ దసరా సెలవుల సీజన్‌లో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించడానికి సిద్ధంగా ఉంది.

OG

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బిగ్-బడ్జెట్ యాక్షన్-క్రైమ్ చిత్రం They Call Him OG (OG) ఈ దసరా సెలవుల సీజన్‌లో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించడానికి సిద్ధంగా ఉంది. అయితే.. ఈ చిత్రం విడుద‌ల నేప‌థ్యంలో సినిమా నిర్మాత DVV దానయ్య విజ్ఞప్తి మేరకు టికెట్ ధరల పెంపునకు అదేవిధంగా ఒక స్పెషల్ బెనిఫిట్ షోకు అనుమతి ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు (బుధ‌వారం,సెప్టెంబర్ 17, 2025) ప్రభుత్వం ఉత్తర్వు (G.O.) జారీ చేసింది.

బెనిఫిట్ షో & టికెట్ ధరల వివరాలు

ఈ ఉత్తర్వు ప్రకారం కింది వివరాలు:స్పెషల్ బెనిఫిట్ షో: సెప్టెంబర్ 25, 2025న ఉదయం 1:00 గంటలకు ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని థియేటర్లలో ఒక ప్రత్యేక బెనిఫిట్ షోకు అనుమతి ఇచ్చింది. ఈ ప్రత్యేక ప్రదర్శన కోసం టికెట్ ధర ₹1,000 (GST సహా)గా నిర్ణయించింది. అయితే, ఒక రోజులో ఐదు షోలు మించకూడదని షరతు విధించింది.

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: ఒక్కో టికెట్‌పై ₹125 (GST సహా) అదనం

మల్టీప్లెక్స్ థియేటర్లు: ఒక్కో టికెట్‌పై ₹150 (GST సహా) అదనం

ఈ ధరల పెంపు సెప్టెంబర్ 25, 2025 నుండి అక్టోబర్ 4, 2025 వరకు అమలులో ఉండ‌నుంది

అభిమానుల్లో.. ఆనందం

ఈ సినిమా ముంబై అండర్ వరల్డ్ నేపథ్యంలో రూపొందిన ఒక యాక్షన్ డ్రామా, మరియు పవన్ కళ్యాణ్ ఒక రౌడీ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. పవన్ కళ్యాణ్ నటన, సుజీత్ దర్శకత్వం, థమన్ సంగీతం, మరియు హై-ఎండ్ యాక్షన్ సన్నివేశాలతో OG ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. ఈ టికెట్ ధరల పెంపు మరియు బెనిఫిట్ షో అనుమతితో, చిత్రం థియేటర్లలో గ్రాండ్ ఓపెనింగ్ సాధించే అవకాశం ఉంది. అయితే.. చాన్నాళ్లుగా సాలీడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు దసరా సెలవుల సీజన్‌తో OG బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంటుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Updated Date - Sep 17 , 2025 | 08:54 PM