Pawan Kalyan OG: పవన్ ఓజీ నుంచి.. సువ్వి సువ్వి పాటొచ్చేసింది!. మైండ్‌లో నుంచి పోతే ఒట్టు
ABN, Publish Date - Aug 27 , 2025 | 11:13 AM
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని తాజాగా బుధవారం ఓజీ సినిమా నుంచి సువ్వి సువ్వి అంటూ సాగే సింపుల్ మెలోడీ లిరికల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు.
RRR వంటి వరల్డ్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత డీవీవీ దానయ్య (DVV Danayya) సాహో ఫేమ్ సుజిత్ (Sujeeth) దర్శకత్వంలో నిన్మిస్తున్న సౌత్ ఇండియాస్ మోస్ట్ హైప్‌డ్ యాంటిసిపేటెడ్ మూవీ ఓజీ (They Call Him OG). ఈ సినిమా నుంచి అప్టేట్స్ కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్న అనేక మంది పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఫ్యాన్స్ ఎదురు చూపులకు ఎట్టకేలకు ఫుల్‌స్టాప్ పెడింది. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని తాజాగా బుధవారం ఓజీ సినిమా నుంచి సువ్వి సువ్వి (Suvvi Suvvi Lyric Video) అంటూ సాగే సింపుల్ మెలోడీ లిరికల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. కల్యాణ చక్రవర్తి (Kalyan Chakravarthy) ఈ పాటకు సాహిత్యం అందించగా తమన్ (Thaman S) సంగీతంలో శృతి రంజని (Sruthi Ranjani) ఆలపించింది. బృంద బాస్టర్ నృత్యం సమకూర్చింది.
ఇక పాట విషయానికి వస్తే.. తమన్ గతంలో బీమ్లా నాయక్, సర్కారు వారి పాట ఇంకా అనేక విజయవంతమైప చిత్రాల పాటలు విడుదల చేసిన సమయంలో ఉపయోగించిన స్ట్రాటజీనే తిరిగి ఇక్కడ ఉపయోగించాడు. మ్యూజిక్‌కు సంబంధించిన అర్కెస్ట్రా, సింగర్స్ అందరినీ ఒక్క దగ్గరే చేర్చి లైవ్ ఫెర్మార్మెన్స్ మాదిరి క్రియేట్ చేశారు. ఉండిపోవా.. ఉండిపో ఇలాగా తోడుగా నా మూడు ముళ్లలాగా నిండిపోవా నీడలాగా నీ లాగా ఉండి రెండుగా ఒక్కటైనా ముడిలాగా అంటూ పాట సాగుతూ పెమ్మదిగా శ్రోతలకు కనెక్ట్ అయ్యేలా ఉంది. ముఖ్యంగా పాటలో ప్రతీ వాయిద్యం చెవులకు ఇంపుగా వినిపిస్తూ మంచి మార్కులు కొట్టేస్తాయి. అలాగే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) , ప్రియాంక మోహన్ (Priyanka Mohan)ల జంట చాలా ఇంట్రెస్టింగ్, మెస్మరైజింగ్‌గా ఉంది. ఓ షాట్‌లో పవన్ కల్యాణ్ లుక్‌కు మాత్రం ఫ్యాన్స్ మెంటలెక్కి పోవడం మాత్రం ఖాయం.
ఇక పాట చూస్తుంటే హీరో ఫ్లాస్ బ్యాక్‌లో డాక్టర్ అయిన తన భార్యను గుర్తు చేసుకుంటూ వచ్చేదిగా ఉండగా హీరో, హీరోయిన్ల మధ్య ఉన్న బాండింగ్‌ను చక్కగా చూపించారు. అంతేగాక చుట్టూ విజువల్స్ చాలా ప్రెష్‌గా, గ్రాండియర్‌గా ఉండి మంచి ఫీల్ ఇచ్చేలా ఉన్నాయి. అన్నింటికన్నా ముఖ్యంగా పాట మొత్తం బ్యా గ్రౌండ్‌లో వచ్చే నవీన్ కుమార్ ఫ్లూట్, కామాక్షి వయోలిన్ వాయుద్యాల సౌండ్ మాత్రం మాములుగా లేదు. పాట అయిపోయినా చాలా సేపు హంట్ చేసేలా ఉంది. ఇంకా చెప్పాలంటే ఈ ఫ్లూట్, వయోలిన్ మ్యూజిక్ మున్ముందు అన్ని సోషల్ మీడియాల్లో వీపరీతంగా వైరల్ అవుతుందనడంలో అతిశయోక్తి లేదు. అంతలా దాని ఇంఫాక్ట్ ఇస్తోంది. పాట మొత్తానికే హైలట్‌గా నిలిచింది. ఈ పాట చాలా త్వరగా చార్ట్‌బస్టర్‌లో చోటు దక్కించుకోవడం ఖాయం. మీరూ ఒక్కసారి ఆస్వాదించండి మరి. ఇదిలాఉంటే ఈ పాట రిలీజ్ అయిన కిద్ది సమయంలోనే అభిమానులు తమన్‌ను ఇళయరాజాతో పోలుస్తూ ఆకాశానికెత్తేస్తూ ట్విట్టర్‌లో టాప్‌లో ట్రెండింగ్‌లోకి తీసుకు రావడం విశేషం.