సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Chandrababu Naidu: పవన్ కళ్యాణ్.. త్వ‌ర‌గా కోలుకోవాలి

ABN, Publish Date - Sep 28 , 2025 | 03:52 PM

గత కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను ఆయన నివాసంలో చంద్రబాబు నాయుడు పరామర్శించారు.

Chandrababu Pawan Kalyan

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఉప ముఖ్యమంత్రి (Deputy CM) జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గత కొన్ని రోజులుగా వైరల్ ఫీవర్‌తో బాధ పడుతున్నాడు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి సమగ్రంగా తెలుసుకున్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఆదివారం హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో ఆయన నివాసానికి వెళ్లి ఉప ముఖ్యమంత్రిని పరామర్శించారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్‌ను త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇందుకు స‌బంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

ఇదిలాఉంటే ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా న‌టించిన ఓజీ చిత్రం ఇటీవ‌ల థియేట‌ర్లకు వ‌చ్చి రికార్డు క‌లెక్ష‌న్ల‌తో బాక్సాఫృస్ వ‌ద్ద సంచ‌ల‌నాలు సృష్టిస్తోంది. ఆ విజ‌యాన్ని పూర్తిగా ఆస్వాదించకుండానే ప‌వ‌న్ ఇలా అనారోగ్యం బారిన ప‌డ‌డంపై అభిమానులు విచారం వ్య‌క్తం చేస్తున్నారు. ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోని మళ్లీ పూర్తి ఆరోగ్యంతో తిరిగి ప్ర‌జా జీవితంలోకి రావాల‌ని కాంక్షిస్తున్నారు.

Updated Date - Sep 28 , 2025 | 03:54 PM