Hari Hara Veera Mallu: హరిహరిహర వీరమల్లు.. రిలీజ్ డేట్ వచ్చేసింది
ABN, Publish Date - Jun 17 , 2025 | 05:35 PM
పవన్ కల్యాణ్ హరిహరిహర వీరమల్లు సినిమా రిలీజ్ విషయంలో మరోక అప్డేట్ వచ్చింది.
ఐదేండ్లుగా వాయిదాల మీద వాయిదా పడుతూ వచ్చిన పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హరిహరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) సినిమా విషయంలో మరోక అప్డేట్ వచ్చింది. గడిచిన నెల రోజులు ఎగ్జిబిట్లర్లు, డిస్ట్రిబ్యూటర్ల సమస్యలు, థియేటర్ల బంద్ అంటూ టాలీవుడ్లో నానా హైరానా జరగడం, ఏపీ డిప్యూటీ సీఎం, సంబంధిత మంత్రి రంగంలోకి దిగడంతో ఆ సమస్య కొలిక్కి వచ్చింది.
ఆపై.. గత వారమే విడుదల కావాల్సి ఉన్న ఈ చిత్రం గ్రాఫిక్స్, తదితర అనివార్య కారణాల వళ్ల చివరి నిమిషంలో సినిమా రిలీజ్ మరోమారు వాయిదా పడడం చకచకా జరిగిపోయాయి. అయితే సినిమా వాయిదా పడ్డాక తిరిగి ఎప్పుడు రిలీజ్ అనే విషయంలో క్లారిటీ లేక పోవడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో మునిగిపోయారు. ఈ క్రమంలో తాజాగా హరిహరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) సినిమా విషయంలో కీలక ఆప్డేట్ వచ్చింది.
సినిమాకు సంబంధించి పెండింగ్లో ఉన్న పనులు చివరి దశకు చేరుకోవడంతో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ఫ్లాట్ పాంతో చర్చల అనంతరం సినిమా విడుదల విషయంలో క్లారిటీ వచ్చినట్లు సమాచారం. అన్ని సమస్యలు ఓ కొలిక్కి వచ్చిన నేపథ్యంలో జూలై 25 న ప్రపంచ వ్యాప్తంగా మూవీని థియేటర్లలోకి తీసుకు రానున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు హాల్చల్ చేస్తున్నాయి. అంతేగాక సినిమా విడుదలకు నెలకు ముందే మరో వారం పది రోజుల్లో ట్రైలర్ సైతం రిలీజ్ చేసే ఫ్లాన్లో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తల విషయంలో మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.