సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Pawan Kalyan: ఆ పట్టుదల ఆయన్నుంచే నేర్చుకున్నా.. 

ABN, Publish Date - Aug 21 , 2025 | 08:42 PM

అన్నింటినీ భరించే శక్తి అన్నయ్య సొంతం. అందుకే ఆయన విశ్వంభరుడు.  విజయాన్ని వినమ్రతతో, అపజయాన్ని సవాలుగా స్వీకరించే పట్టుదల ఆయన్నుంచే నేర్చుకున్నానని  పవన్ కళ్యాణ్ తెలిపారు 

'చిరంజీవి( Hbd Chiranjeevi)  తమ్ముడిగా పుట్టడం అదృష్టమైతే.. ఆయన కష్టాన్ని చిన్నప్పటి నుంచి చూస్తూ పెరగడం ఒక గొప్ప అనుభవం. వెల కట్టలేని జీవిత పాఠం' అని  ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Ap Deputy Cm Pawan kalyan) అన్నారు. శుక్రవారం ఆయన సోదరుడు చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ ఈ లేఖ విడుదల చేశారు.  'అన్నింటినీ భరించే శక్తి అన్నయ్య సొంతం. అందుకే ఆయన విశ్వంభరుడు.  విజయాన్ని వినమ్రతతో, అపజయాన్ని సవాలుగా స్వీకరించే పట్టుదల ఆయన్నుంచే నేర్చుకున్నానని  తెలిపారు 


‘చిరంజీవిగా ప్రేక్షకులను రంజింపచేసి ధ్రువ తారగా వెలుగొందుతున్న మా అన్నయ్యకు ప్రేమ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన చిరంజీవి ఒక అసాధారణ వ్యక్తిగా విజయాలు సాధించి ఎల్లలు దాటి కీర్తిప్రతిష్ఠలు సాధించడం నాకే కాదు.. నాలాంటి ఎందరికో స్ఫూర్తి. చిరంజీవి కీర్తికి పొంగిపోలేదు, విమర్శలకు కుంగిపోనూ లేదు. పితృ సమానుడైన అన్నయ్యకు, మాతృ సమానురాలైన వదినకు భగవంతుడు సంపూర్ణ ఆయుస్సుతో కూడిన ఆరోగ్య సంపదను ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నా’ అని పవన్‌ పేర్కొన్నారు.

చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని ‘విశ్వంభర’ టీమ్‌ అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చింది. ఈ సినిమా  గ్లింప్స్‌ను రిలీజ్‌ చేసింది. వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అనిల్ రావిపూడి కాంబోలో  చిరు చేస్తున్న  ‘మెగా 157’  పేరును శుక్రవారం ప్రకటించనున్నారు.  

Updated Date - Aug 21 , 2025 | 08:42 PM