సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

OG Movie: డిప్యూటీ సీఎంగా ఎంత హై ఇచ్చారో.. ’ఓజీ’తో అంతకు మించి హై ఇచ్చారు..

ABN, Publish Date - Sep 25 , 2025 | 07:34 PM

పవన్‌ కళ్యాణ్‌ ‘ఓజాస్‌ గంభీర’గా నటించిన చిత్రం ఓజీ. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్‌ దాసరి  నిర్మించిన ఈ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. బుధవారం రాత్రి వేసిన ప్రీమియర్స్‌ నుంచి సినిమాకు సూపర్‌హిట్‌ టాక్‌ వచ్చింది.


‘నేను పవన్‌కల్యాణ్‌గారికి వీరాభిమానిని. ‘జానీ’ సినిమా సమయంలో ఆయన్ను కలిస్తే చాలనుకునేవాడి. ఇప్పుడడు ఆయన్ను డైరెక్ట్‌ చేసే అవకాశం వచ్చింది. ఆయనతో చేసిన సినిమా బ్లాక్‌బస్టర్‌ అయింది. ఓ అభిమానికి ఇంతకన్నా ఏం కావాలి’ అని దర్శకుడు సుజీత్‌ అన్నారు.
ఆయన దర్శకత్వంలో పవన్‌ కళ్యాణ్‌ ‘ఓజాస్‌ గంభీర’గా నటించిన చిత్రం ఓజీ. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్‌ దాసరి  నిర్మించిన ఈ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. బుధవారం రాత్రి వేసిన ప్రీమియర్స్‌ నుంచి సినిమాకు సూపర్‌హిట్‌ టాక్‌ వచ్చింది. ఈ సందర్భంగా చిత్ర బృందం సక్సెస్‌ మీట్‌ ఏర్పాటు చేసింది.

సుజీత్‌ మాట్లాడుతూ ‘మూడేళ్ల జర్నీ ఈ సినిమా. మొదటి రోజు నుంచి మమ్మల్ని సపోర్ట్‌ చేస్తూ, మా పక్కనే ఉంటూ మాకు కావాల్సినవన్నీ ఏర్పాటు చేసిన నిర్మాతలు దానయ్య, కళ్యాణ్‌ గారికి కృతజ్ఞతలు. ఓజీ కథకి ఇంతటి భారీతనం రావడానికి కారణమైన పవన్‌ కళ్యాణ్‌గారికి థాంక్స్‌. నేను ఆయనకు వీరాభిమానిని. జానీ సినిమా నుంచి ఆయన్ను కలిస్తే చాలనుకునేవాడి. ఆయన్ను డైరెక్ట్‌ చేసే అవకాశం వచ్చింది. అది బ్లాక్‌బస్టర్‌ అయింది. ఓ అభిమానికి ఇంతకన్నా ఏం కావాలి. తమన్‌, నవీన్‌ నూలి, రవి చంద్రన్‌ ఈ ముగ్గురూ సినిమాకు మూడు పిల్లర్లు. వారి వల్లే సినిమా అవుట్‌పుట్‌ ఇంత అద్భుతంగా వచ్చింది. తమన్‌ నన్ను, ఈ కథను అందరికంటే ఎక్కువగా నమ్మారు’ అన్నారు.


భయం, బాధ్యత పెరిగాయి: తమన్‌
సినిమా విడుదలకు ముందు ఏ నమ్మకంతో ఉన్నామో అది నిజమైంది. ఈ విజయం తర్వాత భయం, బాధ్యత పెరిగాయి. ఓజీ సినిమా మాది కాదు. ప్రజలు దీనిని ఓన్‌ చేసేసుకున్నారు. ఎక్కడ చూసినా ఓజీ హంగామానే కనిపిస్తుంది. పవన్‌ కళ్యాణ్‌ గారికి ఉండే పవర్‌ అది. ఇక ముందు కూడా ప్రేక్షకులకు ఏం కావాలో అది ఇవ్వడానికి మరింత బాధ్యతగా పని చేస్తాం. సుజీత్‌ నేను రెండేళ్లు కలిసి పని చేశాం. కథ విన్నప్పుడే.. ఈ సినిమా చరిత్ర సృష్టిస్తుందని అనుకున్నాను. పవన్‌ కళ్యాణ్‌ గారిని ఇలాంటి కథలో, ఈ తరహా పాత్రలో చూడాలని నాలాంటి ఎందరికో డ్రీమ్‌. ఈ సినిమాతో కుదిరింది. ఈ సినిమా పట్టాలెక్కడానికి కారణమైన త్రివిక్రమ్‌గారికి థ్యాంక్స్‌. పవన్‌ కళ్యాణ్‌ గారి సినిమాకి పని చేయడం అనేది డ్రీమ్‌. నాకు త్రివిక్రమ్‌ గారితో పని చేయడానికి వంద సినిమాలు పట్టింది. అలాగే పవన్‌ గారితో పని చేయడానికి కూడా వంద సినిమాల సమయం పట్టింది. వకీల్‌ సాబ్‌, భీమ్లా నాయక్‌, బ్రో, ఓజీ ఇలా వరుసగా పవన్‌ కళ్యాణ్‌ సినిమాలకు పని చేసే అవకాశం వచ్చింది.  నటుడిగా, కథానాయకుడిగా కల్యాణ్‌గారిని ఎంతో గౌరవిస్తాను. ఆయన 21 సీట్లకు 21 సీట్లు గెలిచి, డిప్యూటీ సీఎం అయ్యి ఎంత హై ఇచ్చారో.. ఇప్పుడు ఓజీకి వస్తున్న స్పందన చూసి మేము అదే హైలో ఉన్నాము. రెండు నెలల ముందు ఓజీ కాపీ చూసినప్పుడే ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుందని మేమంతా నమ్మాము. మేము పెద్దగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించకపోయినా.. అభిమానులు ఈ సినిమాని బాగా ఓన్‌ చేసుకున్నారు. నేను స్వరపరిచిన పాటలకు వారి నుంచి వచ్చిన స్పందన మరిచిపోలేను. నీ వెనుక మేమున్నాం అంటూ దానయ్య గారు, కళ్యాణ్‌ గారు మొదటి నుంచి మమ్మల్ని సపోర్ట్‌ చేశారు.   ఆయన అభిమానులు కోరుకున్న విజయం దక్కింది. ఇది అభిమానులు సాధించిన విజయం’ అని అన్నారు.



ఆయన వల్లే సాధ్యమైంది: డి.వి.వి.దానయ్య
‘ఆనందంలో మాటలు రావడం లేదు. నేను మొట్ట మొదటిగా థాంక్స్‌ చెప్పాల్సింది. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ గారికి. పవన్‌ కళ్యాణ్‌ గారితో సినిమా చేద్దాం అనుకున్నప్పుడు.. దర్శకుడు సుజీత్‌ పేరు త్రివిక్రమ్‌ గారే సూచించారు. త్రివిక్రమ్‌ గారు లేకపోతే ఈ సినిమా లేదు, నాకు ఇంత పెద్ద విజయం వచ్చేది కాదు. పవన్‌  అభిమానులకు నచ్చే సినిమా ఇవ్వాలనే ఎంతో శ్రద్థతో ఈ సినిమా చేశాం. సుజీత్‌తో రెండున్నరేళ్ళకు పైగా ప్రయాణం చేశాను. ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. ఎన్నో రోజులు నిద్ర కూడా మానుకొని పనిచేశాడు. ఓజీ బ్లాక్‌ బస్టర్‌ అవుతుందని తమన్‌ నమ్మకంగా చెప్పేవాడు. ఇప్పుడు అభిమానుల సినిమాలో పవన్‌ లుక్‌, స్టైల్‌, స్వాగ్‌ చూసి ఆశ్చర్యపోయాను.  ఓజీ టైటిల్‌ నాగవంశీ రిజిస్టర్‌ చేయించారు. మా కోసం ఆ టైటిల్‌ ఇచ్చేశారు. ఓజీ టైటిల్‌ సినిమాకి ఎంతో హెల్ప్‌ అయింది. విడుదలకు ముందు ఓజీ ఓజీ అంటూ అభిమానులు ఎంతో సందడి చేశారు. ఇప్పుడు అది రెట్టింపు అయింది’’ అని అన్నారు.

12 ఏళ్ళ ఆకలి తీర్చారు: నిర్మాత నాగవంశీ

‘తమన్‌, నవీన్‌తో మేము ఎక్కువగా సినిమాలు చేస్తుంటాం. నిర్మాతగా కళ్యాణ్‌ భారీ సినిమా చేశాడు. ఈ సినిమా పంపిణీలో మేము కూడా భాగమే. ఓజీ సినిమా చూసి, మా 12 ఏళ్ళ ఆకలి తీర్చారు అంటూ అభిమానులు చెబుతుంటే సంతోషంగా ఉంది. సుజీత్‌కి, తమన్‌కి, నవీన్‌కి వీళ్ళందరికీ పవన్‌ కళ్యాణ్‌ గారి మీద ఉన్న ప్రేమ స్ర్కీన్‌ మీద కనిపించింది’ అని అన్నారు.
 

Updated Date - Sep 25 , 2025 | 08:36 PM