సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Ustaad Bhagat Singh: ఉస్తాద్‌.. బ‌రిలోకి దిగుతున్నాడు

ABN, Publish Date - May 23 , 2025 | 11:59 AM

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్ హీరోగా హరీశ్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఉస్తాద్‌ భగత్‌సింగ్‌.

ustaad

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా హరీశ్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’(Ustaad Bhagat Singh). మూడేండ్ల క్రిత‌మే ప్రారంభ‌మైన ఈ చిత్రం ప‌వ‌న్ రాజ‌కీయాల్లో బిజీగా మార‌డంతో సినిమాకు లాంగ్ గ్యాప్ వ‌చ్చేసింది. త‌ర్వాత ఎన్నిక‌ల్లో ఆయ‌న గెల‌వ‌డం, డిప్యూటీ సీఎం కావ‌డం చ‌క‌చ‌కా జ‌రిగి పోయాయి. ఈ నేప‌థ్యంలో పెండింగ్‌లో ఉన్న సినిమాల‌కు కాస్త స‌మ‌యం కేటాయించి ఆ సినిమాల‌ను పూర్తి చేసే ప‌నిలో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఉన్నారు.

ఈక్ర‌మంలో ఇటీవ‌లే హ‌రిమ‌ర వీర‌మ‌ల్లు చిత్రం పూర్తి చేసిన ఆయ‌న ఓజీ సినిమా షూటింగ్ పూర్తి చేసే ప‌నుల్లో నిమ‌గ్న‌మ‌య్యారు. ఇదే స‌మ‌యంలో హ‌రీశ్ శంక‌ర్ (Harish Shankar) ద‌ర్శ‌క‌త్వంలో కొద్దిగా చిత్రీక‌రించి పెండింగ్‌లో పెట్టిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ సినిమాను సైతం ప‌ట్టాలెక్కించారు. గురువారం హ‌నుమాన్ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని హ‌రీశ్ శంక‌ర్ ఈ మూవీ నుంచి ఓ పోస్ట‌ర్ రిలీజ్ చేశారు. జూన్ నుంచి షూటింగ్ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం ఈ పోస్ట‌ర్ నెట్టింట వైర‌ల్ అవుతుండ‌గా సినిమా ఎట్ట‌కేల‌కు స్టార్ట్ కానుండ‌డంతో ఫ్యాన్స్ సైతం సంబుర ప‌డుతున్నారు.

ఔట్ అండ్ ఔట్ మాస్ మ‌సాలా, క‌మ‌ర్షియ‌ల్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’(Ustaad Bhagat Singh). సినిమాను మైత్రీ మూవీ మేక‌ర్స్ (Mythri Movie Makers) నిర్మిస్తోండ‌గా, శ్రీలీల (Sreeleela) హీరోయిన్‌, అశుతోష్ రాణా, గౌత‌మి, న‌వాబ్ షా కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ (DSP) సంగీతం అందిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమాకు సంబంధించి మొద‌టి షెడ్యూల్‌లో హీరోహీరోయిన్ల మ‌ధ్య కొన్ని ల‌వ్ సీన్లతో పాటు ప్ర‌త్య‌ర్థుల‌తో కొన్ని పోరాట స‌న్నివేశాలు సైతం చిత్రీక‌రించారు.

Updated Date - May 23 , 2025 | 11:59 AM