Pawan Fans in London: మీ రూల్స్ ఎవరికి చెప్పారు.. ఎక్కడ పెట్టారు..
ABN, Publish Date - Jul 26 , 2025 | 12:46 PM
అభిమానుల చేష్టలు కొన్ని సందర్భాల్లో మంచిగా ఉన్నా.. పలు సందర్భాలో పరువు తీసే విధంగా ఉంటాయి. యూకేలోని సినీ వరల్డ్ థియేటర్‌లో ఫాన్స్ చేసిన హంగామా ట్రోలింగ్‌కు గురైంది
ఇండియన్ చిత్రాలకు ఓవర్సీస్‌లో క్రేజ్ ఎక్కువ. అందులోనూ తెలుగు చిత్రాలకు మరీ ఎక్కువ. తాజాగా పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నటించిన ‘హరిహర వీరమల్లు’ ఓవర్సీస్‌లో భారీ స్థాయిలో విడుదలైంది. అభిమానులు ప్రతి చోటా కోలాహలం చేశారు. అయితే అభిమానుల చేష్టలు కొన్ని సందర్భాల్లో మంచిగా ఉన్నా.. పలు సందర్భాలో పరువు తీసే విధంగా ఉంటాయి. యూకేలోని సినీ వరల్డ్ థియేటర్‌లో (UK Cine world Theater)ఫాన్స్ చేసిన హంగామా ట్రోలింగ్‌కు గురైంది. ‘హరిహర వీరమల్లు’ (HHVM)చిత్రం ప్రొజెక్షన్ జరుగుతుండగా ఆ అభిమాని సృష్టించిన హంగామా ఇంటర్‌నెట్ అంతా వైరల్ అయింది. ఇప్పుడిది హాట్ టాపిక్‌గా మారింది. ఈ నెల 25న లండన్‌లోని ఓ సింగిల్ స్క్రీన్ థియేటర్‌లో హరిహర వీరమల్లు చిత్రం షో జరుగుతోంది. తొలిరోజే లండన్ సమీప ప్రాంతాల అభిమానులు అంతా ఆ ధియేటర్‌కి చేరుకున్నారు. తమ అభిమాన హీరోని తెరపై చూడగానే ఉత్సాహం ఆపుకోలేక రంగు కాగితాలు స్క్రీన్ పై చల్లుతూ ఎంజాయ్ చేశారు.
అయితే విదేశాల్లో థియేటర్లు నిబంధనలకు లోబడి ఉంటాయి. కాన్ఫెట్టిను (రంగు కాగితాలు)థియేటర్‌లో వాడాలంటే ముందుగా థియేటర్ యాజమాన్యం అనుమతి పొందాలి. కానీ అక్కడి అభిమానులు అనుమతి తీసుకోకుండానే సందడి చేయడంతో థియేటర్ సిబ్బంది తీవ్రంగా స్పందించారు. వెంటనే సినిమా స్క్రీనింగ్ నిలిపివేశారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ‘థియేటర్ ఏది చేసినా చెల్లదు. ఇక్కడ నిబంధనలు కఠినంగా ఉంటాయి. మీరు ఏదైనా చేయాలంటే ముందు అనుమతి కావాలి’ అని సిబ్బంది స్పష్టంగా చెప్పినట్లు ఆ వీడియో ద్వారా తెలుస్తోంది. దీనికి ఫ్యాన్స్ కౌంటర్ ఇచ్చారు ‘ఇలాంటి రూల్స్ ఉన్నాయని థియేటర్‌లో ఎక్కడా బోర్డ్‌లు కనిపించలేదు’ అని వాదించారు.
ఇప్పుడీ విషయంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ‘థియేటర్ సిబ్బంది సరిగ్గా స్పందించారు’ అంటుంటే, మరికొందరు ‘‘అభిమానులు అత్యుత్సాహం వల్ల ఇతరులకు అసౌకర్యం కలిగింది’’ అని విమర్శిస్తున్నారు. ముఖ్యంగా ఇందులో ‘ఇది ఇండియా కాదు’ అనే మాట ఇప్పుడు ట్రెండింగ్ ట్యాగ్‌గా మారింది.
READ ALSO:
Sobhan Babu: బ్లాంక్ చెక్ ఇచ్చినా మహేష్ కు తాతగా చేయను
Murali Mohan - Athadu: అతడు రీ రిలీజ్.. ఈసారి పక్కా హిట్..
Shruti Haasan: ఆ ఫెయిల్యూర్స్ నా వల్ల జరగలేదు.. కానీ నింద నాపైనే..
Tanushree Dutta: సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్‌లా చంపే ప్లాన్‌లో..