8 Vasantalu:  '8 వసంతాలు' నుంచి చిత్ర పాడిన పాట రిలీజ్!

ABN , Publish Date - Jun 11 , 2025 | 07:43 PM

మ్యాడ్(Mad) సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్ అనంతిక సనీల్ కుమార్(Ananthika Sanilkumar) ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 8 వసంతాలు(8 Vasantalu). 

8 Vaasantalu

8 Vasantalu: మ్యాడ్(Mad) సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్ అనంతిక సనీల్ కుమార్(Ananthika Sanilkumar) ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 8 వసంతాలు(8 Vasantalu).  ఫణీంద్ర నర్సేట్టి(Phanindra Narsetti )దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) నిర్మించారు. ఈ చిత్రంలో రవితేజ దుగ్గిరాల, హను రెడ్డి, కన్న పసునూరి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. జూన్ 20 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

 Director Thiagarajan:  టూరిస్ట్ ఫ్యామిలీలో హిట్ సాంగ్..  నాకు గర్వంగా  ఉంది 

రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ వరుసగా.. సినిమాలోని లిరికల్ వీడియోలను  రిలీజ్ చేస్తూ హైప్ పెంచుతున్నారు. తాజాగా 8 వసంతాలు నుంచి మరో అద్భుతమైన లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. పరిచయమిలా పరిమళములా అంటూ సాగిన ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. హేషమ్ అబ్దుల్ వహాబ్ మరోసారి తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేశాడని చెప్పాలి.

 

ఇక వనమాలి అందించిన లిరిక్స్ ఒక ఎత్తు అయితే.. చిత్రమ్మ  తన వాయిస్ తో సాంగ్ ను ఎక్కడికో తీసుకెళ్లిపోయారు.  మనసును హత్తుకునేలా ఈ సాంగ్ లో విజువల్స్.. ఆ మ్యూజిక్ ఎంతో ఫ్రెష్ గా  అనిపించాయి. ప్రేమించిన అబ్బాయి గురించి అమ్మాయి ఆలోచిస్తూ... కనులకి తెలియని కలలను కంటున్నా.. ఇదివరకెరుగని ఉదయము చూస్తున్నా అంటూ తన రోజు జీవించే లైఫ్ లోనే  కొత్తదనం వచ్చిందని, ఇదంతా ప్రేమ వలనేనా అని తనకు తెలియకుండానే ప్రేమలో పడిపోతుందని భావం వచ్చేలా వనమాలి లిరిక్స్ అందించిన విధానం ఆకట్టుకుంటుంది.

 

 

ఇక విజువల్స్ పరంగా ఎంతో కొత్తగా.. చూడడానికి కనువిందుగా కనిపించాయి. అనంతిక చీరకట్టులో కనిపించి మరింత మెప్పించింది. మొత్తానికి ఈ సాంగ్ ఒక కొత్త అనుభూతిని ఇవ్వడంతో పాటు సినిమాపై హైప్ ను కూడా పెంచేసింది. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఈ సినిమా  ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. 

Updated Date - Jun 11 , 2025 | 07:43 PM