Director Thiagarajan: టూరిస్ట్ ఫ్యామిలీలో హిట్ సాంగ్.. నాకు గర్వంగా ఉంది
ABN , Publish Date - Jun 11 , 2025 | 06:57 PM
ఈ ఏడాది చిన్న సినిమాగా వచ్చి భారీ విజయాన్ని అందుకున్న సినిమా టూరిస్ట్ ఫ్యామిలీ(Tourist Family).
DirectorThiagarajan: ఈ ఏడాది చిన్న సినిమాగా వచ్చి భారీ విజయాన్ని అందుకున్న సినిమా టూరిస్ట్ ఫ్యామిలీ(Tourist Family). కోలీవుడ్ హీరో శశి కుమార్(Sasi Kumar), సిమ్రాన్(Simran) జంటగా అభిషన్ జీవింత్( Abishan Jeevinth) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 29న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ఆ తరువాత వచ్చిన హిట్ 3(Hit3), రెట్రో(Retro) సినిమాలకన్నా అత్యధిక కలక్షన్స్ రాబట్టి రికార్డ్ సృష్టించింది. ఇక టూరిస్ట్ ఫ్యామిలీ థియేటర్ లో తెలుగులో రాకపోయినా.. ఓటీటీలో మాత్రం అన్ని భాషల్లో రిలీజ్ చేశారు. దీంతో ఇక్కడ కూడా ఈ చిన్న సినిమా పెద్ద సక్సెస్ ను అందుకుంది. డైరెక్టర్ గా ఒక పాతికేళ్ల కుర్రాడు మొదటి ప్రయత్నంగా తెరకెక్కించిన ఈ సినిమా విజయం ఎంతోమందిని షాక్ కి గురయ్యేలా చేసింది.
ఇక ఈ సినిమాలో హైలైట్ అంటే బాలనటుడు కమలేష్ జగన్ నటనకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ముఖ్యంగా అన్న బ్రేకప్ తట్టుకోలేక ఏడుస్తుంటే.. అతనికి నచ్చిన పాట పెట్టి డ్యాన్స్ వేసే సీన్ సోషల్ మీడియా ను షేక్ చేసింది. మలైయురు నట్టమా .. మనసు కాటు పుటామా అంటూ సాగే ఈ సాంగ్ ఎంత పెద్ద సెన్సేషన్ సృష్టించిందో అందరికీ తెల్సిందే. అసలు ఈ సాంగ్ ఏ సినిమాలోది.. ? హీరో ఎవరు.. ? డైరెక్టర్ ఎవరు.. ? అంటూ నెటిజన్స్ ఆరాలు తీయడం మొదలుపెట్టారు.
కోలీవుడ్ హీరో ప్రశాంత్, మీరా జాస్మిన్ జంటగా త్యాగరాజన్(Thiagarajan) దర్శకత్వం వహించి నిర్మించిన చిత్రం మంబట్టియాన్(Mambattiyan). 2011 లో రిలీజ్ అయిన ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది. కానీ, ఈ సినిమాలోని మంబట్టియాన్ అనే సాంగ్ మాత్రం హిట్ గా నిలిచింది. ఈ సాంగ్ లో ముమైత్ ఖాన్, ప్రశాంత్ కలిసి డ్యాన్స్ చేశారు. అప్పట్లో ఈ సాంగ్ కోలీవుడ్ ను ఒక ఊపు ఊపేసింది. ఇక ఇన్నాళ్ల తరువాత మరోసారి టూరిస్ట్ ఫ్యామిలీలో ఈ సాంగ్ వినిపించింది. ఇప్పుడు కూడా ఈ పాట సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
Thammudu Trailer: ఉత్కంఠ రేపుతున్న తమ్ముడు ట్రైలర్..
తాజాగా ఈ సాంగ్ ను టూరిస్ట్ ఫ్యామిలీలో పెట్టడంపై డైరెక్టర్ త్యాగరాజన్( స్పందించాడు. అనుమతి లేకుండా సాంగ్ పెట్టినా కూడా తనకేమి అభ్యంతరం లేదని చెప్పుకొచ్చాడు. " నా సాంగ్ టూరిస్ట్ ఫ్యామిలీలో ఉపయోగించడం ఎంతో ఆనందంగా ఉంది. ఎవరి అనుమతి తీసుకోకుండా పెట్టినా నాకు సంతోషంగానే ఉంది. చాలామంది నాకు అనుమతి లేకుండా ఉపయోగించారు కదా.. లీగల్ చర్యలు తీసుకోమని చెప్పారు. కానీ, నేను ఆ పనిచేయలేదు. ఎందుకంటే.. నా పాట మరో సినిమా విజయానికి దోహదపడింది. అది నాకు గర్వంగా ఉంది" అని తెలిపాడు. ఇక ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
చాలామంది నెటిజన్స్ త్యాగరాజన్ చేసిన వ్యాఖ్యల తరువాత మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజాపై విమర్శలు గుప్పిస్తున్నారు. తన పాట వేరే సినిమాలో అనుమతి లేకుండా ఉపయోగించారని ఆయన కోర్టుకు వెళ్లి పిటిషన్ పెట్టారు. ఒక్క సినిమాకు మాత్రమే కాదు.. చాలా సినిమాలకు ఇళయరాజా ఇలానే చేశారు. త్యాగరాజన్ లా ఇళయరాజా ఆలోచించలేదని, మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పటికైనా మారితే బావుంటుందని కామెంట్స్ పెడుతున్నారు.