Kalki 2898 AD: కన్నప్ప రిలీజ్ తో ట్రెండింగ్ లో 'కల్కి పార్ట్ 2'
ABN , Publish Date - Jun 27 , 2025 | 06:44 PM
ది మోస్ట్ అవెయిటెడ్ మూవీ అప్డేట్ వచ్చేసింది.. మొదటి పార్టీ విడుదలై ఏడాది అవుతుండడంతో నెక్స్ట్ పార్ట్ అప్డేట్ ని వదిలారు మేకర్స్. అదిరిపోయే ట్విస్టులతో.. అంతకు మించిన విజువల్ ఎక్స్పీరియన్స్ తో ఉంటుందని అప్పుడే ఊరించడం మొదలు పెట్టేశారు. ఇంతకీ దేని గురించి అనుకుంటున్నారా.. అయితే ఈ స్టోరీ చదవాల్సిందే.
'కల్కి 2898 AD' (Kalki 2898 AD) తో పాన్ ఇండియానే కాదు, గ్లోబల్ బాక్సాఫీస్‌ని షేక్ చేశాడు రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) . నాగ్ అశ్విన్(Nag Ashwin ) విజన్, కాశీ బ్యాక్‌డ్రాప్‌లో సైన్స్- ఫిక్షన్ మహాభారతం, దీపికా పడుకోణె ఎమోషనల్ డెప్త్, అశ్వథ్థామగా అమితాబ్ బచ్చన్, సుప్రీం యాస్కిన్ గా కమల్ హాసన్ (Kamal Haasan).. ఇలా అదిరిపోయే కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ రూ. 1000 కోట్ల కలెక్షన్స్ సాధించింది. ఈ ఎపిక్ బ్లాక్‌బస్టర్ విడుదలై ఏడాది పూర్తయిన సందర్భంగా ఫ్యాన్స్ సెలబ్రేషన్ మోడ్‌లో ఉన్నారు. మొదటి భాగం అభిమానులను ఊహించని క్లైమాక్స్‌తో థ్రిల్ చేసింది కానీ సీక్వెల్ అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూపులు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో తాజాగా మేకర్స్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ డ్రాప్ చేశారు
నిర్మాత అశ్వనీదత్ లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం, 'కల్కి 2' షూటింగ్ సెప్టెంబర్ నుంచి ఊపందుకోనుంది. వచ్చే ఏడాది మే లేదా జూన్‌లో రిలీజ్ కానుంది. మొదటి పార్ట్ ను మించి సెకండ్ పార్ట్ గ్రాండ్ స్కేల్‌లో రాబోతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ ని ఆకట్టుకునేలా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. దీంతో అప్పుడే సెకండ్ పార్ట్ పై సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది.
ప్రభాస్ క్యారెక్టర్ భైరవ ఈ సారి ఏ రేంజ్‌లో రచ్చ చేయబోతున్నాడో, కమల్ హాసన్ విలనీ ఎలా పీక్స్‌కి తీసుకెళ్తాడోనని అప్పుడే అభిమానులు మాట్లాడుకుంటున్నారు. ఇంకా కొత్త క్యారెక్టర్స్, ట్విస్ట్‌లతో కథ మరింత ఎపిక్‌గా ఉంటుందని చెప్పుకుంటున్నారు. తాజాగా కన్నప్ప మూవీ లో ప్రభాస్ మరోసారి మెరవడంతో ఈ చర్చలు మరింత జోరుగా సాగుతున్నాయి. మొత్తానికి కల్కి మేనియా మరోసారి సోషల్ మీడియాను చుట్టేసింది.
Read Also: Manchu Manoj Vs Kannappa: ఇలా చేస్తారని.. కలలో కూడా అనుకోలే! కన్నప్పపై.. మంచు మనోజ్ రివ్యూ