Ghaati: మరోసారి వాయిదా దిశగా 'ఘాటీ'

ABN , Publish Date - Jul 29 , 2025 | 06:04 PM

కోటి క‌ళ్ళతో ఎదురు చూస్తున్న ఆ బ్యూటీ అభిమానులు మ‌ళ్లీ డిజప్పాయింట్ అవ్వక త‌ప్పడం లేదు. అల్రెడీ త‌మ ఫేవ‌రేట్ హీరోయిన్ ను చూడ‌క ఏళ్లు గ‌డిచిపోతోంటే.. మూవీ మేక‌ర్స్ దాన్ని మ‌రింత వాయిదా వేస్తున్నారు. క‌నీసం ఈ నెల‌లోగా తమ క‌ల తీరుతుంది అనుకుంటే... ఫైన‌ల్లీ కాద‌ని తేలిపోయింది.

కన్నడ బ్యూటీ అనుష్కా శెట్టి (Anushka Shetty) ని ఎప్పుడెప్పుడు వెండితెరపై చూస్తామా అని ఎదురుచూస్తున్న అభిమానులు మ‌ళ్లీ బ్యాడ్ న్యూస్ వినక త‌ప్పేలా లేదు. 'ఘాటి' (Ghaati) సినిమాతో ఈ బ్యూటీని ఆన్ స్క్రీన్ చూడొచ్చని అనుకుంటే అది కూడా అనుమానంగానే క‌నిపిస్తోంది. ఈ నెలలో రిలీజ్ కావాల్సిన 'ఘాటీ' మూవీ వాయిదా ప‌డింది. వీఎఫ్‌ఎక్స్ పనుల్లో జాప్యం కారణంగా పోస్ట్ పోన్ చేసిన‌ట్టుగా తెలుస్తోంది. వాయిదా ప‌డితే ప‌డింది కానీ క‌నీసం చిత్ర బృందం కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించలేదు. సెప్టెంబర్ 5న సినిమా వస్తుందని ఊహాగానాలు వినిపిస్తున్నా... తాజా సమాచారం ప్రకారం అది కూడా కన్ఫర్మ్ కాలేదు. దీంతో అభిమానులు గందరగోళంలో పడ్డారు.


తమ ఫేవరెట్ స్టార్‌ను స్క్రీన్‌పై చూడాలని అనుష్క అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' (Miss Shetty Mr Polishetty) తర్వాత ఆమె బయట కనిపించడమే మానేసింది. అంతేకాదు ఏ ఫంక్షన్‌ లోనూ, ఏ వేదిక‌ పైనా, ఏ ప్రోగ్రామ్‌లోనూ క‌నిపించ‌డం లేదు. ఇటీవల ‘బాహుబలి' (Baahubali) 10 ఇయర్స్ రీ-యూనియన్ ఈవెంట్‌కు కూడా అనుష్క హాజరు కాకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. క‌నీసం 'ఘాటీ' సంద‌ర్భంగా అయినా ఆమె బ‌య‌ట‌కు వ‌స్తుంద‌ని అనుకుంటే.. అది కాస్త వాయిదా ప‌డింది. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి (Krish Jagarlamudi), నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ (UV Creations) ఎవరూ కూడా అభిమానుల సందేహాల‌కు స‌మాధానం ఇవ్వడం లేదు.

'ఘాటీ' సినిమా సెప్టెంబ‌ర్ నెలలో దాదాపుగా రిలీజ్ కాక‌పోవ‌చ్చనే ఊహాగానాలు వస్తున్నాయి. పాన్ ఇండియన్ ఫిల్మ్ ‘మిరాయ్' (Mirai) ని సెప్టెంబర్ 5న రిలీజ్ చేసేందుకు ఆ టీమ్ రెడీ అవుతోంది. దీంతో ‘ఘాటి’ మేక‌ర్స్ పోటీ లేని సోలో రిలీజ్ కోసం చూస్తున్నట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ లో రిలీజ్ కాకపోతే, సినిమా ఆ తర్వాత నెలల్లో రావచ్చొనే టాక్ వినిపిస్తోంది. అయితే రిలీజ్ ఎంత ఆలస్యమైతే, సినిమాపై ఉన్న హైప్ అంత తగ్గుతుందన్నది మరో వెర్షన్. దీంతో త్వరగా రిలీజ్ డేట్ ప్రకటించాల‌ని అభిమానులు కోరుతున్నారు. చూడాలి మ‌రి ఏం జ‌రుగుతుందో!

Read Also : rithik Roshan: 'వార్ 2' కోసం 'బ్రహ్మాస్త్ర' టీమ్...

Read Also :The Raja Saab: బర్త్ డే సందర్భంగా సంజయ్ దత్ స్పెషల్ పోస్టర్

Updated Date - Jul 29 , 2025 | 06:04 PM